Chicken Roll: చికెన్ రోల్ ఇవ్వలేదని అక్కసుతో హోటల్ కు నిప్పుపెట్టిన రౌడీషీటర్.. చివరకు ఏం జరిగింది?

Chicken Roll: మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. అందుకే అన్నారో సినీకవి మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అని. మనిషిలో రాక్షసత్వం పెరిగిపోతోంది. తన మాట నెగ్గలేదనే పంతంతో తప్పు అని తెలిసినా తప్పు చేసేందుకే తప్పటడుగు వేస్తున్నాడు. అర్థరాత్రి వెళ్లి చికెన్ రోల్ కావాలని హోటల్ వారిని బెదిరించాడు. హోటల్ మూసే సమయం అయ్యిందని మీరు అడిగింది లేదని చెప్పినా వినకుండా వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చి హోటల్ పై […]

Written By: Srinivas, Updated On : December 14, 2022 5:07 pm
Follow us on

Chicken Roll: మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. అందుకే అన్నారో సినీకవి మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అని. మనిషిలో రాక్షసత్వం పెరిగిపోతోంది. తన మాట నెగ్గలేదనే పంతంతో తప్పు అని తెలిసినా తప్పు చేసేందుకే తప్పటడుగు వేస్తున్నాడు. అర్థరాత్రి వెళ్లి చికెన్ రోల్ కావాలని హోటల్ వారిని బెదిరించాడు. హోటల్ మూసే సమయం అయ్యిందని మీరు అడిగింది లేదని చెప్పినా వినకుండా వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చి హోటల్ పై పోసి నిప్పంటించాడు. దీంతో అందరు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణాపాయం లేకున్నా ఆస్తినష్టం మాత్రం జరిగింది.

Chicken Roll

కర్ణాటకలోని జనశంకరిలో హనుమంత నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్థరాత్రి రౌడీషీటర్ దేవరాజ్ తన అనుచరులతో వచ్చాడు. చికెన్ రోల్ కావాలని ఆర్డర్ వేశాడు. దీంతో హోటల్ సిబ్బంది హోటల్ మూసే సమయం అయ్యింది మీరు అడిగింది ఇవ్వలేమని సమాధానం చెప్పడంతో కోపోద్రిక్తుడైన దేవరాజ్ తన ఇద్దరు అనుచరులతో హంగామా చేశాడు. మద్యం మత్తులో ఉన్న వారిని హోటల్ సిబ్బంది బయటకు నెట్టేశారు. ఎంతకు చెప్పినా వినకపోవడంతో వారిపై చేయి కూడా చేసుకున్నారు.

దేవరాజ్ తన అనుచరులతో సమీపంలోని పెట్రోల్ బంకుకు వెళ్లి రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చారు. హోటల్ సిబ్బంది ఉన్న గది మీద పోసి నిప్పంటించారు. మంటలు చెలరేగడంతో అందరు పరుగులు పెట్టారు. ప్రాణాపాయం లేకున్నా తలుపులు, కిటికీలు కాలిపోయాయి. పోలీసులకు సమాచారం అందించడంతో వారు మంటలు ఆర్పేసి అందుకు కారకులైన దేవరాజ్, గణేష్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతడి కోసం కూడా గాలిస్తున్నారు.

Chicken Roll

ఇలాంటి ఘటనే బెంగుళూరులో కూడా జనవరిలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని హావేరి జిల్లా హెడిగొండలో రట్టిహళ్లికి చెందిన వసీం అక్రమ్ ముల్లా తనకు కెనరా బ్యాంకు మేనేజర్ రుణం ఇవ్వలేదనే కోపంతో బ్యాంకుకు నిప్పంటించాడు. సిబ్బంది, ఖాతాదారులు పట్టుకునేందుకు ప్రయత్నించినా కత్తి చూపించడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బ్యాంకులో కంప్యూటర్లు, ఇతర వస్తువులు కొన్ని పత్రాలు కాలిబూడిదయ్యాయి. నగదు, నగదు మాత్రం భద్రంగానే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Tags