Mohan Babu Misbehaved On Media: విలక్షణ నటుడే కాదు.. వివాదాస్పద నటుడు కూడా మోహన్‌బాబు. తరచూ ఇండస్ట్రీకి సబంధించిన విషయాలతో కాంట్రవర్సీ చేసే డైలాగ్ కింగ్ తాజాగా మీడియా గొడవపడి మరో వివాదానికి తెరతీశాడు. మీడియాఆపై తన ఆధిపత్యం చూపాలనుకుని అభాసుపాలయ్యాడు.
రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి..
తన తదనంతరం వీలునామా కోసమో.. ఆస్తి పంపకాల కోసమో మోహన్‌బాబు గురువారం షాద్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కవరేజీ కోసం అక్కడికి వెళ్లాడు. మీడియా హడావుడి చూసిన మోహన్‌బాబు బౌన్సర్లు కవరేజీని అడ్డుకునేందకు మీడియా ప్రతినిధులను పక్కకు తప్పించారు. అయినా మీడియా ప్రతినిధులు కవరేజీ కోసం లోగోలు పట్టుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
కోపంతో ఊగిపోయిన ‘బాబు’..
మీడియా హడావుడి నచ్చలేదో.. లేకుంటే.. తాను ఎందుకు వచ్చాననే విషయం ఎవరికీ తెలియకూడదని అనుకూడాన్నడో ఏమో.. మీడియాను చూసి మోహన్‌బాబుకు చిర్రెత్తుకొచ్చాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. బుద్ధి లేదా అంటూ నటుడు మోహన్‌బాబు మీడియాపై చిందులు వేశాడు. లోగోలు, కెమెరాలు లాక్కోవాలని బౌన్సర్లకు హుకూం జారీ చేశాడు.
ఆస్తులు పంచాడా…
నటుడు మంచు మోహన్‌బాబు తన ఆస్తులను కొడుకులకు పంచేందుకే షాద్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి. మనోజ్ పెళ్లి విషయంలో మోహన్‌బాబు కూడా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అక్క సపోర్టుతో మనోజ్ పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని మనోజే స్వయంగా చెప్పాడు. ఈ క్రమంలో కుటుంబంలో క్రమంగా గొడవలు పెరుగుతున్నాయి. కలిసి ఉండాల్సిన అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతోంది. దీంతో ఆస్తులు పంచాలని మోహన్‌బాబు డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే షాద్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిసింది.
తన తదనంతరం కూడా..
తన వద్ద ఎంత ఆస్తి పెట్టుకోవాలి.. ఆది తన తదనంతరం ఎవరికి చెందాలి. అనే విషయమైకూడా వీలునామా రాశారని తెలిసింది. దానిని కూడా రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ బయటకు రాకుండా మోహన్‌బాబు బౌన్సర్లతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం.