Nadia Comaneci:తూర్పు ఐరోపా నుంచి ఎక్కువ మంది క్రీడల్లో ప్రతిభ చూపిస్తుంటారు. అద్వితీయమైన ప్రతిభతో కారణంగా నిలిచిన ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారు. అటువంటి క్రీడాకారుల గురించి తూర్పు ఐరోపాలో కథలుగా చెబుతుంటారు. వీరిలో ఒక క్రీడాకారిణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రీడాకారినే రొమేనియాకు చెందిన జిమ్నాస్టి నదియా కొమెనెసి. ఒలంపిక్స్ లో పర్ఫెక్ట్ స్కోరు 10 సాధించిన మొదటి మహిళగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
రొమేనియన్ జిమ్నాస్టి నదియా కొమెనెసి 1976లో మాంట్రియల్ ఒలంపిక్స్ లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచానికి తన సత్తాను చాటింది. ఈ ఒలంపిక్స్ లో ఐదు బంగారు పతకాలను గెలుచుకోవడంతోపాటు ఖచ్చితమైన స్కోరు సాధించిన మొట్టమొదటి మహిళా జిమ్నాస్టిగా పేరుగాంచింది. అటువంటి గొప్ప క్రీడాకారుని గురించి ప్రపంచం మరిచిపోయింది. అటువంటి జిమ్నాస్టిక్ గురించి తెలుసుకోవడం నేటి తరానికి ఎంతైనా అవసరం ఉంది. నదియా కొమెనెసి 1961 లో వనేష్టి అనే చిన్న రొమేనియన్ పట్టణంలో జన్మించింది. ఆమె కేవలం పదేళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తల్లి తెఫానియాతో కలిసి జీవనం సాగించింది. నదియాలో ఉన్న ఎనర్జీని, ఉత్సాహాన్ని గుర్తించిన తల్లి ఏదో ఒక క్రీడలో రాణించేలా చేయాలని భావించింది. అందుకు అనుగుణంగానే జిమ్నాస్టిక్ క్లాసుల్లో చేర్పించింది. జిమ్నాస్టిక్ ను అమితంగా ఇష్టపడిన నదియా విపరీతంగా ప్రాక్టీస్ చేసేది. జిమ్నాస్టిక్ పాఠాలు మొదట ప్రారంభమైనప్పుడు.. నదియాకు ఇది తన జీవితపు మలుపు పిలుపు అని స్పష్టమైంది. జిమ్నాస్టిక్స్ లో కష్టతరమైన నిత్య కృత్యాలు ఆమెకు దాదాపు సహజమయ్యాయి. కిండర్ గార్డెన్ లో కూడా వాటిని ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఆనందించేది. జిమ్నాస్టిక్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి అద్భుతమైన కెరియర్ కు దారి తీసింది.
జిమ్నాస్టిక్స్ పట్ల నదియా కు ఉన్న అభిరుచి ఎలిమెంట్స్ ను సులభంగా చేయగలిగిన ఆమె సహజ సామర్థ్యం, బేలా అనుభవంతోపాటు జిమ్నాస్టిక్స్ చరిత్రలో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎదగడానికి అవకాశాన్ని కల్పించింది. నదియా ప్రతిరోజు మూడు గంటలు, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ శిక్షణ తీసుకునేది. అదృష్టవశాత్తు నదియా జిమ్నాస్టిక్స్ పాఠశాల పక్కనే నివసించేది కాబట్టి ఆమె ప్రాక్టీస్ కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం రాలేదు. నదియా ప్రతిభను మెచ్చి 1977లో గ్రామీ అవార్డును అందుకుంది. 1978లో వరల్డ్ ఛాంపియన్షిప్ ను గెల్చుకుంది. 1980 మాస్కోలో జరిగిన ఒలంపిక్స్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. జర్మనీలో జరిగిన మ్యాక్సీ గ్నాక్ టోర్నీలో సిల్వర్ మెడల్ సాధించింది. వీటితోపాటు అనేక అంతర్జాతీయ టోర్నీళ్లు అదరగొట్టి వందలాది మెడల్స్ సాధించిన నదియా 1984లో రిటైర్మెంట్ ప్రకటించింది.