
NTR- Allu Arjun: ఈమధ్య టాలీవుడ్ లో క్రేజీ మల్టిస్టార్రర్ సినిమాలు రావడం సర్వసాధారణం అయిపోయింది, కలలో అయినా సాధ్యపడుతుందా అని అనుకున్న కాంబినేషన్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ #RRR చిత్రం చేసిన తర్వాత ఇలాంటి మల్టీస్టార్ర్ర్ సినిమాలను తియ్యడానికి దర్శక నిర్మాతలు ధైర్యం చూపిస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడానికి అమితాసక్తిని చూపిస్తున్నాడు.
#RRR చిత్రం తర్వాత కొరటాల శివ తో ఒక సినిమా చేస్తున్న ఎన్టీఆర్, ఈ చిత్రం తర్వాత ఆయన హిందీ లో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ చేస్తున్నాడు. రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. చేతిలో ఉన్న ఈ సినిమాలన్నీ పూర్తి అయిన తర్వాత ఆయన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఒక మల్టీస్టార్ర్ర్ మూవీ చెయ్యబోతున్నట్టు బాలీవుడ్ మొత్తం ఇప్పుడు కోడై కూస్తుంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య థార్ ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ని పౌరాణిక నేపథ్యం లో ‘ది ఇమ్మోర్తల్స్ ఆఫ్ అశ్వద్దామా’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ఇటీవలే వీళ్ళిద్దరిని కలిసి స్టోరీ లైన్ వినిపించగా, ఇద్దరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట.పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రమ్మని డైరెక్టర్ కి చెప్పారట, అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ క్రేజీ కాంబినేషన్ ని త్వరలోనే మనం వెండితెర పై చూడొచ్చు

టాలెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ రేంజ్ లో బద్దలు అవుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి ‘పుష్ప : ది రూల్’ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే ఆయన సందీప్ రెడ్డి వంగ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ఈ క్రేజీ మల్టీస్టార్ర్ర్ సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.