https://oktelugu.com/

Viral: లేటు వయసు.. ఘాటు ప్రేమ

Viral: రెండక్షరాల ప్రేమ.. ఎంతటి సాహసమైనా చేయిస్తుంది. ఇద్దరి మనుసుల కలయిక ఎక్కడికైనా దారి తీస్తుంది. ప్రేమ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు. ప్రేమకోసం సలీం త్యాగం చేశాడు. లైలా మజ్నూల ప్రేమ చరిత్రలో నిలిచిపోయింది. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ప్రేమకు అంతటి పవర్ ఉంది. అవును నిత్యం చాలా చూస్తుంటాం. ప్రేమకోసం ప్రాణం తీసుకున్న వారు ఎందరో.. ప్రాణాలు తీసిన వారు ఎందరో.. ప్రేమకోసం కుటుంబాన్ని వదలి నిలిచిన వారు చాలా మంది […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 3, 2021 / 01:05 PM IST
    Follow us on

    Viral: రెండక్షరాల ప్రేమ.. ఎంతటి సాహసమైనా చేయిస్తుంది. ఇద్దరి మనుసుల కలయిక ఎక్కడికైనా దారి తీస్తుంది. ప్రేమ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు. ప్రేమకోసం సలీం త్యాగం చేశాడు. లైలా మజ్నూల ప్రేమ చరిత్రలో నిలిచిపోయింది. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ప్రేమకు అంతటి పవర్ ఉంది. అవును నిత్యం చాలా చూస్తుంటాం. ప్రేమకోసం ప్రాణం తీసుకున్న వారు ఎందరో.. ప్రాణాలు తీసిన వారు ఎందరో.. ప్రేమకోసం కుటుంబాన్ని వదలి నిలిచిన వారు చాలా మంది ఉన్నారు… ప్రస్తుత సమాజంలో.. అయితే.. ఇక్కడో విచిత్రకరమైన ప్రేమ కథ చెప్పాలి.. అదేంటంటే.. సాధారణంగా.. చిన్నతనంలో ప్రేమించుకున్న వారికి పెద్దలు అడ్డుచెప్పి.. వేరే వివాహం చేస్తే.. వారు ఏం చేస్తారో నాలుగైదు రోజులు బాధపడి మరో వివాహం చేసుకుంటారు. తన భర్త.. భార్య.. పిల్లలే సర్వస్వంగా అనుకుని కొత్త జీవనం సాగిస్తుంటారు… అయితే ఇక్కడో ప్రేమ జంట ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పింది. ప్రేమంటే ఇదేరా.. అనిపించేలా చేసింది.

    Love marriage at the age of 65

    ఇద్దరూ జీవన ప్రయాణంలో చివరి మజిలీలో కొనసాగుతున్నారు. ఇద్దరి వయసూ.. 65 దాటిపోయింది. ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ. సాధారణంగానే ఆమెకు యుక్తవయసులో ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరొకరితో పెద్దలు వివాహం జరిపించారు. ప్రేయసి దక్కలేదన్న బాధతో ఆ యువకుడు పెళ్లి చేసుకోలేదు… ఒంటరిగానే తన జీవనాన్ని కొనసాగించాడు. కొంత కాలానికి తన ప్రేయసి భర్త కాలం చేశాడు. ఆమెకు పిల్లలు లేరు. విషయం ప్రియుడికి తెలిసినా.. ఆమె దగ్గరికి వెళ్లలేదు. పాత గుర్తులు నెమరు వేసుకుంటూ.. కాలాన్ని గడుపుతూ వచ్చారు. చివరికి నిర్ణయించుకున్నారు. కుటుంబం తమని విడదీసినా.. కాలం మళ్లీ ఒక్కటయ్యే అవకాశం కల్పించిందని.. దాన్ని తాము సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా.. ఆచరణకు ముందడుగు వేశారు. సమాజం గురించి ఆలోచన చేయలేదు. కట్టుబాట్లను పట్టించుకోలేదు.. 65ఏళ్ల వయసులో తమ ప్రేమను మళ్లీ గెలిచారు.
    Also Read: పొరపాటున కూడా ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోకండి.. ఏవంటే?

    ఇంతకీ ఎక్కడదీ కథ అనుకుంటున్నారా..? కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన సంఘటన ఇదీ.. మాండ్య జిల్లా మెలుకొటేలో ఈ వివాహం జరిగింది. మెలుకొటే చెలవ నారాయణుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో మైసూరులోని హెబ్బాల ప్రాంతానికి చెందిన చిక్కణ్ణ, అదే ప్రాంతానికి చెందిన జయమ్మ(65).. సంప్రదాయ పద్ధతి ప్రకారం వివాహం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకే అంటారు.. ప్రేమకు వయసు.. కులం.. మతంతో సంబంధం లేదని.. ఈ లేటువయసు ప్రేమికుల ఫొటోలు ప్రస్తుతం షోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.

    Also Read: ఆ విషయంలో ప్రతి ఒక్కరూ మనసు చెప్పింది వినాల్సిందే..?

    Tags