Shekar Movie: శేఖర్​ సినిమాకు ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు

Shekar Movie: ప్రస్తుతం సినిమాలన్నీ ఓటీటీవైపే అడుగులేస్తున్నాయి. కరోనా తర్వాత థియేటర్లు మూతపడటంతో ఈ ఓటీటీల హవా పెరిగిపోయింది. ప్రేక్షకులు కూడా ఎక్కువగా థియేటర్ల వైపు మొగ్గు చూపకపోవడం వల్ల సినిమాలన్నీ ఓటీటీల్లోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోననే చిన్న చిన్న సినిమాలు మాత్రమే నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయే తప్ప.. పెద్ద సినిమాలేవీ ఇందులో నేరుగా విడుదలకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఓ సినిమాపై అన్ని ఓటీటీలు కన్నేశాయి.. అదే రాజశేఖర్ హీరోగా వస్తోన్న శేఖర్ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 3, 2021 4:30 pm
Follow us on

Shekar Movie: ప్రస్తుతం సినిమాలన్నీ ఓటీటీవైపే అడుగులేస్తున్నాయి. కరోనా తర్వాత థియేటర్లు మూతపడటంతో ఈ ఓటీటీల హవా పెరిగిపోయింది. ప్రేక్షకులు కూడా ఎక్కువగా థియేటర్ల వైపు మొగ్గు చూపకపోవడం వల్ల సినిమాలన్నీ ఓటీటీల్లోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోననే చిన్న చిన్న సినిమాలు మాత్రమే నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయే తప్ప.. పెద్ద సినిమాలేవీ ఇందులో నేరుగా విడుదలకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఓ సినిమాపై అన్ని ఓటీటీలు కన్నేశాయి.. అదే రాజశేఖర్ హీరోగా వస్తోన్న శేఖర్ సినిమా.

Dr Rajasekhar’s Shekar Movie First Look Poster

ఈ సినిమాను డైరెక్ట్​ రిలీజ్​ కింద తీసుకునేందుకు కొన్ని ఓటీటీలు దర్శకనిర్మాతలను సంప్రదించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఫ్యాన్సీ ధరలను ఆఫర్​ చేశాయట. తాజా సమాచారం ప్రకారం.. శేఖర్ సినిమా స్ట్రీమింగ్​ రైట్స్​ కోసం 22 నుంతి 25 కోట్లు వరకు ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: హీరో రాజశేఖర్ ఆ మూవీలు చేసి ఉంటేనా?

అయితే, ఓటీటీ సంస్థలన్నీ శేఖర్​ సినిమాపై ఇంత కేర్​ తీసుకోడానిక రెండు ప్రధాన కారణాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా లాంటి జానర్​లు ఓటీటీల్లో బాగా ట్రెండ్​ అవుతున్నాయి. మరోవైపు ఈ సినిమా మలయాళంలో హిట్​గా నిలిచిన జోసెఫ్​కు రీమేక్​గా తెరకెక్కింది. దీంతో శేఖర్​ సినిమాపై అన్ని కోట్లు కుమ్మరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ వీడియోకు క్రేజ్​ మాములుగా రాలేదు. ఈ క్రమంలోనే మరిన్ని ఆఫర్లు పెరిగినట్లు తెలుస్తోంది.

Also Read: తొలిసారి డైరెక్టర్​ కామెంటరీతో ఓటీటీలో సినిమా.. అసలు అందులో ఏముంటుంది?

ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు కథ, స్క్రీన్ ప్లేలో మార్పులు చేసినట్లు సమాచారం. ఈ రీమేక్ మూవీకి జీవిత రాజశేఖర్ డైరక్టర్. స్క్రీన్ ప్లే విభాగం కూడా ఆమెనే చూసుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.