Homeఎంటర్టైన్మెంట్Salman Khan: విక్టరీ వెంకటేష్ సినిమాలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్...

Salman Khan: విక్టరీ వెంకటేష్ సినిమాలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్…

Salman Khan: సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు సల్మాన్. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా సల్మాన్ కి దేశ విదేశాల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. కాగా మన తెలుగు హీరోలు బాలీవుడ్‌ చిత్రాల్లో కీలక పాత్రలు చేయడం తరచుగా జరుగుతూ ఉంటుంది. కానీ బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాల్లో నటించడం చాలా అరుదు. అయితే మెగాస్టార్ చిరంజీవికి సల్మాన్ ఖాన్ కి మంచి స్నేహ బంధం ఉన్న విషయం తెలిసిందే.

bollywood star hero salman khan going to act in venkatesh movie
Venkatesh Daggubati and Salman Khan

అయితే సల్మాన్ నటించిన అంతిమ్ సినిమా రిలీజ్ మంచి విజయం సాధించింది. ఈ మేరకు ‘అంతిమ్‌’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు సల్మాన్. తన బావమరిది ఆయుష్ శర్మ, చిత్ర దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌‌లతో కలిసి సందడి చేశాడు సల్మాన్ భాయ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘త్వరలో చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయబోతున్నాను. చిరంజీవి, రామ్‌ చరణ్ నాకు చాలా క్లోజ్ అని చెప్పారు. అలానే వెంకటేష్ కూడా నాకు బాగా తెలుసు. ఆయనతో కూడా మూవీ చేయబోతున్నాను అంటూ అదిరిపోయే న్యూస్ రివీల్ చేశాడు సల్మాన్ ఖాన్.

Also Read: ‘వెంకీ’కి ఆ పేరు ఎలా వచ్చిందంటే ?

మలయాళ హిట్ ‘లూసిఫర్’ ఆధారంగా చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ చేస్తున్నారు. ఒరిజినల్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను తెలుగులో సల్మాన్ పోషిస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ తను వెంకటేష్‌ సినిమాలో యాక్ట్ చేయడమనేది ఎవరు ఊహించని విషయం. దీంతో వెంకీ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సల్మాన్ అభిమానులు కూడా ఆనందంలో ఉన్నారు. అయితే అది ఏ ప్రాజెక్ట్, సల్మాన్ ఎలాంటి పాత్ర పోషించనున్నాడు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. అ విషయాలు త్వరలోనే రివీల్ చేస్తానని సల్మాన్ చెప్పడంతో… అప్డేట్ ఎప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Also Read: చిరంజీవి అడిగారని ఓకే చెప్పా అంటున్న సల్మాన్ ఖాన్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version