https://oktelugu.com/

డైహార్ట్ ఫ్యాన్ కోరిక తీర్చిన ఎన్టీఆర్

వెంకన్న అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని గత కొంతకాలంగా కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్టీఆర్ ను కలవాలని చాలా ఆశపడ్డారు. ఫ్యాన్ గురించి వివరాలు తెలుసుకున్న ఎన్టీఆర్ తాజాగా వీడియో కాల్ తో వెంకన్న, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ఎన్టీఆర్ ను అమితంగా ఇష్టపడే అభిమాని వెంకన్న కోరికను యంగ్ టైగర్ తీర్చాడు. ఎన్టీఆర్ స్వయంగా తన అభిమానితో వీడియోకాల్ ద్వారా మాట్లాడి అతడికి సర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2020 / 06:23 PM IST
    Follow us on


    వెంకన్న అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని గత కొంతకాలంగా కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్టీఆర్ ను కలవాలని చాలా ఆశపడ్డారు. ఫ్యాన్ గురించి వివరాలు తెలుసుకున్న ఎన్టీఆర్ తాజాగా వీడియో కాల్ తో వెంకన్న, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఎన్టీఆర్ ను అమితంగా ఇష్టపడే అభిమాని వెంకన్న కోరికను యంగ్ టైగర్ తీర్చాడు. ఎన్టీఆర్ స్వయంగా తన అభిమానితో వీడియోకాల్ ద్వారా మాట్లాడి అతడికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ ను చూడగానే ఫ్యాన్ కళ్లల్లో ఆనందం, కన్నీళ్లు ఉప్పొంగాయి.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో జలియన్ వాలాబాగ్.. పుకారేనా?

    కరోనా వల్ల ఎవరినీ కలవలేకపోతున్నానని.. ఈ టైంలో బయట తిరగడం అందరికీ మంచిది కాదని ఫ్యాన్ వెంకన్నతో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఖచ్చితంగా నిన్ను చూడడానికి వస్తానని వెంకన్నకు హామీ ఇచ్చారు. ఇక వెంకన్న తల్లి ఈ సందర్భంగా తన గోడు వెల్లబోసుకుంది. తన కుమారుడు కండరాల వ్యాధితో కనీసం కూర్చోవడం లేదని.. నడవడం లేదని.. చచ్చుబడిపోయాడని.. మీరే ఆదుకోవాలంటూ ఎన్టీఆర్ ను వేడుకుంది.

    Also Read: సుధీర్ బాబు ‘శ్రీదేవి’ ఆమెనా?

    వెంకన్నకు ఏ సాయం కావాలన్నా తాను చేస్తానంటూ వీడియో కాల్ లో ఎన్టీఆర్ హామీ ఇచ్చాడు. ఇక వెంకన్న మీతో ఒక్కసారి సెల్ఫీ దిగడమే తన చివరి కోరిక అంటూ అనగా.. ఎన్టీఆర్ ఆనందంగా ఉండాలని.. అదే ఆయుష్షును పెంచుతుందని.. నిన్ను కలుస్తానంటూ భరోసానిచ్చాడు.