https://oktelugu.com/

రానా, కోహ్లీ, ప్రకాష్ రాజ్ కు షాక్.. హైకోర్టు నోటీసులు

డబ్బు ఆశతో ముందు వెనుకా ఆలోచించకుండా యాడ్స్ లలో నటించిన సెలెబ్రెటీలు చిక్కుల్లో పడ్డారు. కోట్లు ఇచ్చారని ఆ ప్రకటనల్లో నటిస్తే ఆ కంపెనీలను ప్రజలను నిండా ముంచాయి. దీంతో ఇప్పుడా సెలబ్రెటీలకు ఉచ్చు బిగుసుకుంటోంది. Also Read: సన్‌ రైజర్స్‌కు ఇది డూ ఆర్‌‌ డై మ్యాచ్‌ ఈ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు అనుకూల ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, సినీ నటులు దగ్గుబాటి రానా, సుదీప్, ప్రకాష్ రాజ్ […]

Written By: , Updated On : November 3, 2020 / 05:55 PM IST
Follow us on

High Court notices to Rana, Prakash Raj

డబ్బు ఆశతో ముందు వెనుకా ఆలోచించకుండా యాడ్స్ లలో నటించిన సెలెబ్రెటీలు చిక్కుల్లో పడ్డారు. కోట్లు ఇచ్చారని ఆ ప్రకటనల్లో నటిస్తే ఆ కంపెనీలను ప్రజలను నిండా ముంచాయి. దీంతో ఇప్పుడా సెలబ్రెటీలకు ఉచ్చు బిగుసుకుంటోంది.

Also Read: సన్‌ రైజర్స్‌కు ఇది డూ ఆర్‌‌ డై మ్యాచ్‌

ఈ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు అనుకూల ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, సినీ నటులు దగ్గుబాటి రానా, సుదీప్, ప్రకాష్ రాజ్ లకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఈనెల 19లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ పై మద్రాస్ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ లో వందలాది మంది డబ్బులు పోగొట్టుకున్నారని పిటీషన్ తెలిపాడు.

Also Read: పీవీ సింధూ రిటర్ మెంట్.. ట్విస్ట్ ఇచ్చిందిలా!

విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు మద్దతుగా ప్రకటనల్లో నటించిన సెలెబ్రెటీలకు నోటీసులు అందించింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈనెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.