Nandamuri Suhasini Son Sriharsha: నందమూరి కుటుంబంలో శుభకార్యం చోటు చేసుకుంది. దివంగత నటుడు హరికృష్ణ కుమార్తె సుహాసిని కుమారుడైన శ్రీహర్ష ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన శ్రీహర్ష ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు పలువురు హాజరయ్యారు. సుహాసిని సోదరుడు కళ్యాణ్ రామ్ సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే దివంగత జానకిరామ్ భార్య పిల్లలు సైతం వేడుకలో పాల్గొన్నారు. అయితే మరో తమ్ముడు ఎన్టీఆర్ మాత్రం రాలేదు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదన్న చర్చ తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆస్కార్ వేడుక ముగించుకుని మంగళవారం ఎన్టీఆర్ నగరానికి రావడం జరిగింది. ఎన్టీఆర్ బిజీగా ఉన్నారని, అందుకే శ్రీహర్ష ఎంగేజ్మెంట్ కి రాలేకపోయారనే వాదన వినిపిస్తోంది. అంతేనా వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుండి సుహాసిని టీడీపీ తరఫున పోటీ చేశారు. అక్క కోసం ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తారని పలువురు భావించారు. ఎన్టీఆర్ మాత్రం కన్నెత్తి చూడలేదు.
ఈ క్రమంలో సుహాసినితో ఎన్టీఆర్ కి హెల్తీ రిలేషన్స్ ఉన్నయా? లేదా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కాగా హరికృష్ణకు ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సంతానం సుహాసిని, జానకిరామ్, కళ్యాణ్ రామ్. రెండో భార్య షాలినికి ఎన్టీఆర్ పుట్టారు. ఎన్టీఆర్ ఒకవేళ మేనల్లుడు వివాహానికి కూడా హాజరు కాకుంటే విభేదాల పుకార్లకు బలం చేకూరుతుంది.
మార్చి 2న జరిగిన తారకరత్న పెద్దకర్మ కార్యక్రమంలో బాలయ్య ఎన్టీఆర్ ని అవమానించారంటూ సోషల్ మీడియాలో చర్చ నడిచింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరినీ పలకరించిన బాలకృష్ణ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు మనస్తాపానికి గురయ్యారు. బాలయ్య మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య-ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ కి ఈ పరిమాణం కారణమైంది. ఇక టీడీపీ పార్టీ ఎవరిదనే విషయంలో నందమూరి ఫ్యాన్స్ రెండుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ సినిమాకు సిద్ధం అవుతున్నారు.