
KCR Kavitha Troll: దేశంలో రాజకీయ అంశాలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ. దీంతో ప్రత్యర్థులను దాదాపు అన్ని పార్టీలు సోషల్ మీడియా వేదికగానే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నాయి. అయితే దేశ చరిత్రలో కల్వకుంట్ల వారసురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ, ముఖ్యమైన మంత్రి కేటీఆర్ గారాల చెల్లి కవిత మొట్టమొదటిసారిగా రికార్డు స్థాయిలో ట్రోల్ అవుతున్నారు. ఆమె లిక్కర్ స్కాంలో చిక్కుకున్న నాటి నుంచి విపక్షాలు, వ్యతిరేకులు, నెటిజన్లు.. కవిత గతంలో మాట్లాడిన మాటలు, టీవీలకు ఇంటర్వ్యూల్లోని పదాలను ఎడిటింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు. సొంత ఇళ్లు లేదన్న కవిత రూ.20 లక్షల వాచ్ పెట్టుకోవడం, రజినీకాంత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు, కవిత చెప్పిన సమాధానాలు, సినిమా పాటలు జోడించి వైరల్ చేస్తున్నారు. గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతలా ట్రోల్ కాలేదని చెప్పవచ్చు. దీంతో కవిత ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావొద్దని కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇది కవిత, ఆమె తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన మాటలతో దీనిని తయారు చేశారు.
బీజేపీనే నిర్ణయిస్తుందన్న కవిత..
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన దీక్షపై ప్రచారం కోసం కవిత ఇటీవల టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కాంపై కూడా ఆమెను న్యూస్ రీడర్స్ ప్రశ్నలు వేశారు. టెన్ టీవీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కవితను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన ల్కిర్ స్కాం గురించి అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం ఇస్తూ.. బీజేపీ నాయకులే దర్యాప్తు సంస్ధలను నిర్దేశిస్తున్నారని, ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ కనుసన్నల్లోనే దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని, వేధిస్తున్నాయని ఆరోపించారు. ఈ చిన్న బిట్‌ను దొరకబట్టుకున్న విపక్షాలు, నెటిజన్లు, కవిత తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన మాటలు, విమర్శలు బూతు మాటలు జోడించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కేసీఆర్ మాటలకు చెవులు మూసుకోవాల్సిందే..
ఈ వీడియోలో కేసీఆర్ వాడిన భాషకు చూసేవాళ్లు చెవులు మూసుకోవాల్సిందే. ఆ పదాలు, తిట్లుల ఇక్కడ రాయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. చూడాలంటే, వినాలంటే కింద లింక్ ఇస్తున్నాం చూడండి.. వినండి. ఇక అవన్నీ కూతురునే తిట్టినట్ల అర్థం వచ్చేలా ఆ భాషను జోడించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు తర్వాత మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ఈ మాటలు మాట్లాడారు. బీజేపీని దూషించారు. దుర్భాషలాడారు. ఇప్పుడు అవన్నీ కవిను అన్నట్లుగానే వీడియో తయారు చేయడంతో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజర్లు కూడా.. గతంలో విపక్షాలపై చేసిన ఆరోపణలన్నీ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికే వర్తిస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.