Homeబిజినెస్Top 10 Upcoming Bikes 2023 India: 2023లో రాబోయే టాప్10 బైక్ లు.. తప్పక...

Top 10 Upcoming Bikes 2023 India: 2023లో రాబోయే టాప్10 బైక్ లు.. తప్పక కొనాలి అనిపించే వాటి ఫీచర్లు

Top 10 Upcoming Bikes 2023 India: కరోనా నేపథ్యంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆటోమొబైల్ రంగం… ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ప్రపంచంలో చాలా దేశాల్లో కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది మార్కెట్ పై భారీ అంచనాలను పెట్టుకుంది.. కొనుగోళ్ళు కూడా ఆశించినంత స్థాయిలో జరుగుతాయని భావిస్తోంది.. ఈ క్రమంలో ఈ ఏడాది మార్కెట్లో ఆయా కంపెనీలు పలు బైక్ ల మోడళ్ళను తీసుకురానున్నాయి.. ప్రస్తుతం బ్యాక్-టు-బ్యాక్ లాంచ్‌లతో ఆటోమొబైల్ పరిశ్రమ చాలా సాధారణ స్థితికి చేరుకుంది. ఒక వేళ కరోనా కనుక మళ్ళీ ఇబ్బంది పెట్టకుంటే 2023 సంవత్సరం లో అమ్మకాలు జోరుగా సాగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది వచ్చే మోడళ్లు ఏమిటి? వాటి ప్రత్యేకతలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

Top 10 Upcoming Bikes 2023 India
Top 10 Upcoming Bikes 2023 India

రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650

రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650
కంపెనీ 648 సీసీ సమాంతర ట్విన్ ఇంజన్‌ తో మోటార్‌సైకిల్ ను రూపొందించింది. సూపర్ మీటోర్ 650 ఇటలీలోని ఈఐసీఎంఏ లో ఆవిష్కరించారు..ఆ తర్వాత నవంబర్‌లో 2022 రైడర్ మానియా సమయంలో భారతదేశంలో ప్రవేశించింది. ఇంజన్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 మాదిరిగానే ఉన్నప్పటికీ, సూపర్ మెటోర్ 65లో షోవా అప్‌సైడ్-డౌన్ ఫోర్క్స్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, అల్యూమినియం విడిభాగాలను ఆప్ గ్రేడ్ చేశారు. ఇది జనవరిలో మార్కెట్లో విడుదల కాబోతోంది. సుమారు రూ. 3.5 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర లో లభిస్తుంది.

Top 10 Upcoming Bikes 2023 India
Royal Enfield Super Meteor 650

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350
ఈ ఏడాదికి సూపర్ మీటోర్ 650 ప్రారంభమైన తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త తరం బుల్లెట్ 350 ధరను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. కొత్త మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లోని జే సిరీస్ మోటార్‌సైకిళ్లలో చేరనుంది. ఇది 350, క్లాసిక్ 350, హంటర్ 350 రకాల్లో లభిస్తుంది. ప్రస్తుత తరం మోటార్‌సైకిల్ కంటే కొంచెం ఎక్కువ ధరలో ఇది లభ్యమవుతుంది.

Top 10 Upcoming Bikes 2023 India
Royal Enfield Bullet

కేటీఎం 390

కేటీఎం 390 అడ్వెంచర్ పరిధిలో తోపు బైక్ ఇది. ఇది హార్డ్‌కోర్ ఆఫ్-రోడ్ సామర్థ్యం కలిగిన తేలికపాటి మోటార్‌సైకిల్‌ మాదిరి ఉంటుంది. దాదాపు రూ. 2.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ధర నిర్ణయించారు.

Top 10 Upcoming Bikes 2023 India
KTM 390

హీరో ఎక్స్ ప్లస్ 400

మిడిల్ వెయిట్ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్ లో భాగంగా హీరో మోటోకార్ప్ ఈ బైక్ ను రూపొందించింది. ఈ కేటగిరీలో పెద్ద ఎక్స్ ప్లస్ 400 42 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది బీఎండబ్ల్యూ జీ 310 జీ ఎస్ ని అధిగమించేలా దీని పనితీరు ఉంటుంది. హీరో మోటార్ కార్ప్ కు డాకర్ ర్యాలీ స్టేజ్ నుండి అనుభవం ఉంది. ఈ ఎక్స్ ప్లస్ 400 మోడల్ కు.. హిమాలయన్ 450, 390 అడ్వెంచర్‌లకు గట్టి పోటీనిచ్చే సామర్థ్యం ఉన్నది.

Top 10 Upcoming Bikes 2023 India
X Plus 400

2023 కెటీఎం 390 డ్యూక్

ఈ సంవత్సరం చివరి నాటికి ఇది మార్కెట్లోకి వస్తుంది. కొత్త తరంలో 390 డ్యూక్‌లో చాలా మార్పులు వచ్చాయి, ఇంజన్ 373 సీ సీ నుంచి 399సీసీ కి పెరిగింది, కాబట్టి ఎక్కువ పవర్, టార్క్ ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. కొన్ని గూఢచారి షాట్‌లు దీనికి కొత్త ఫ్రేమ్, సబ్‌ఫ్రేమ్, స్వింగ్‌ఆర్మ్ కూడా దీనికి జత చేయనున్నారు. ఇది అప్‌డేట్ చేసిన సస్పెన్షన్‌ రకం. 3.5 లక్షల (ఎక్స్-షోరూమ్)ధర లో ఇది లభ్యమవుతుంది.

Top 10 Upcoming Bikes 2023 India
ktm duke 390

ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ రేంజ్

స్ట్రీట్ ట్రిపుల్ శ్రేణి 2022లో అప్‌డేట్ చేసిన మోడల్ ఇది. కొన్ని నెలల్లో భారతదేశంలో లభ్యమవుతుంది. కొత్త స్ట్రీట్ ట్రిపుల్ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది – ఆర్, ఆర్ ఎస్, మోటో2. ఆర్, ఆర్ ఎస్ రెండూ మునుపటి కంటే ఎక్కువ శక్తిని, టార్క్‌ను కలిగి ఉన్నాయి. ఇక వీటి ధరలు రూ. 9.5-11.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

Top 10 Upcoming Bikes 2023 India
Triumph Street Triple

యమహా ఎం టీ-07, వైజీఎఫ్-R7

యమహా చాలా కాలంగా భారత్‌కు పెద్ద బైక్‌లను తీసుకురావడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఎంటీ-09 మోడల్ ను విడుదల చేసింది. అయితే దానిని అతి త్వరలో నిలిపి వేయాలని చూస్తున్నది. యమహా ఎంటీ-07, ఆర్7 లను ఈ ఏడాది తీసుకు రాబోతున్నది. ఈ రెండూ మరి కొద్ది నెలల్లో ఈ రెండూ సీ బీ యూ లుగా పరిమిత సంఖ్యలో వస్తాయని అంచనా. వీటి ధర రూ. 10-12 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని తెలుస్తోంది.

Top 10 Upcoming Bikes 2023 India
Yamaha YZF-R7

హోండా హార్నెట్, ట్రాన్సల్ప్

2022లో కొత్త సీబీ750 హార్నెట్‌ను ఆవిష్కరించారు, దీని తర్వాత ఈ 750 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన అడ్వెంచర్ బైక్‌ను ఆవిష్కరించారు. హోండా కొత్త హార్నెట్, ట్రాన్సల్ప్ రెండింటినీ త్వరలో విడుదల చేయనుంది. బహుశా 2023 మధ్య నుండి చివరి వరకు. ఈ రెండింటి ధర రూ. 10-11 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు.

Top 10 Upcoming Bikes 2023 India
honda hornet trasell

సుజుకి వీ-స్టార్మ్ 800 డీఈ

సుజుకి గత సంవత్సరం ఈఐసీఎంఏ వద్ద వీ_ స్ట్రామ్ 800 డీ ఈ రూపంలో వీ- స్ట్రామ్ 650కి అప్‌గ్రేడ్‌ను ఆవిష్కరించింది. 650 మాదిరిగానే, ఈ 800 కూడా ఉత్తమమైన ఫీచర్స్ తో రూపొందింది. ఇవి దీపావళి కి మార్కెట్ లోకి వస్తాయి. రూ. 11 లక్షలకు (ఎక్స్-షోరూమ్) ఇది లభ్యమవుతుంది.

Top 10 Upcoming Bikes 2023 India
uzuki V-Strom 800 DE
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version