
Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లిపై పలు రూమర్స్ ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో ప్రేమలో ఆమె ఉన్నారని. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని లావణ్య త్రిపాఠి పలుమార్లు వెల్లడించారు. తాజాగా మరోసారి తన పెళ్లి గురించి లావణ్య త్రిపాఠి ఆసక్తికర కామెంట్స్ చేశారు. లావణ్య మాట్లాడుతూ… పెళ్లి చేసుకోమని పేరెంట్స్ నన్ను ఒత్తిడి చేయడం లేదు. అలాగే వెంటనే పెళ్లి చేసుకోవాలని నేను కలలు కనడం లేదు. ప్రస్తుతం నా దృష్టి సినిమాలు, కెరీర్ మీదే. అయితే పెళ్లి ఆలోచన ఉంది. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను.
అయినా పెళ్లి అనేది వ్యక్తిగత విషయం. దాని గురించి అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు… అని లావణ్య కుండబద్దలు కొట్టారు. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన లావణ్య త్రిపాఠి వయసు 32 ఏళ్ళు. గ్లామర్ ఫీల్డ్ లో దీన్ని పెళ్లీడుగా భావించరు. అందుకే లావణ్య అప్పుడే పెళ్లేంటి అన్నట్లు మాట్లాడుతుంది. కాగా లావణ్య కెరీర్ బాగా డల్ అయ్యింది. ఆమె హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోయింది. ఈ మధ్య ఆమె నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్ అయ్యాయి.
లావణ్య నటించిన సూపర్ హిట్ మూవీ భలే భలే మగాడివోయ్. 2015లో విడుదలైంది. నిఖిల్ హీరోగా విడుదలైన అర్జున్ సురవరం మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. లావణ్య చివరి మూడు చిత్రాలు ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో మేకర్స్ ఆమెకు ఆఫర్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఓ తమిళ చిత్రం చేస్తున్నారు.

సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ తగ్గడంతో డిజిటల్ కంటెంట్ మీద దృష్టి పెట్టింది. ఆమె ప్రధాన పాత్రలో పులి మేక టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్ విడుదలైంది. జీ 5లో స్ట్రీమ్ అవుతున్న పులి మేక సిరీస్ సైతం నిరాశపరిచింది. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉన్న లావణ్యకు పవర్ ఫుల్ పోలీస్ రోల్ సెట్ కాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందాల రాక్షసి మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన లావణ్య త్రిపాఠి మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి ఆరంభం లభించినా కెరీర్ నిర్మించుకోలేకపోయారు. మరి లావణ్య కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.