Homeఅంతర్జాతీయంPakistan: తారాస్థాయికి ఆర్థిక సంక్షోభం: పాక్ లో  10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?

Pakistan: తారాస్థాయికి ఆర్థిక సంక్షోభం: పాక్ లో  10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?

Pakistan financial Crisis
Pakistan financial Crisis
Pakistan: దాయాది దేశం పాక్ లో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. దవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. 50 సంవత్సరాల గరిష్టానికి దవ్యోల్బణం చేరుకుందని అక్కడి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు గత ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచి 31.5% చేరుకుంది. పాకిస్తాన్లో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర 280 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల బంగారం 2.6 లక్షలు పలుకుతోంది. అంతేకాదు పాకిస్తాన్ కరెన్సీ విలువ కూడా దారుణంగా పడిపోతుంది.

Also Read: Lavanya Tripathi: పెళ్లి చేసుకోవాలని కలలు కనడం లేదు… హీరోయిన్ లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్స్!

దవ్యోల్బణ కారణాలు చూపుతూ పాకిస్తాన్ కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లు దారుణంగా పెంచింది. ప్రస్తుతం అది 300 బేసిస్ పాయింట్లకు చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా రుణ వడ్డీ రేటు 20 శాతానికి చేరుకుంది. నిత్యవసరల ధరలు మండిపోతుండడంతో ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అక్కడక్కడ లూటీలకు కూడా పాల్పడుతున్నారు. కంపెనీలు మూసేయడంతో ఉపాధి లభించక యువత ఆకలితో అలమటిస్తున్నారు. బయటి ప్రపంచానికి తెలియడం లేదు గాని.. సింధ్ ప్రావిన్స్ లో ఆకలి చావులు కూడా చోటుచేసుకుంటున్నాయి.. ప్రభుత్వం దగ్గర నగదు నిల్వలు లేకపోవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు.. కనీసం నిత్యవసరాలు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు.
Pakistan financial Crisis
Pakistan financial Crisis
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ అప్పు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విధించిన షరతులకు పాకిస్తాన్ తలవంచింది.. బడ్జెట్ లోటు తగ్గించుకుని అన్ని వసూళ్ళను పెంచుకోవడమే లక్ష్యంగా ఇటీవల మినీ బడ్జెట్ ఆవిష్కరించింది. ఫారెక్స్ నిల్వలు సరిగా లేకపోవడంతో అత్యవసరాలు ఔషధాలు, దేశంలో ఉత్పత్తి చేసే ఇతర మెడిసిన్ ముడి సరుకును సైతం దిగుమతి చేసుకోలేక పాకిస్తాన్ విలవిలలాడుతోంది. దీంతో స్థానిక ఔషధ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. మరోవైపు ఔషధాలు లభించకపోవడంతో ఆసుపత్రుల్లో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందులు, వైద్య పరికరాల కొరత కారణంగా వైద్యులు శస్త్ర చికిత్సలను నిలిపివేస్తున్నారు. దీంతో కొన్ని కొన్ని ఆస్పత్రుల్లో రోగులు కన్నుమూస్తున్నారు. ఇక నిత్యావసరాలు లభించకపోవడంతో ప్రజలు వాటికోసం గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

AP Global Investors Summit: ఆంధ్రాపై పెట్టుబడిదారుల మక్కువ వెనుక అసలు కారణం ఇదే

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version