Kim Jong Un: కిమ్ జాంగ్ ఉన్… ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు తనకు పోటీ అని కుటుంబంలోని కీలక తోబుట్టువులను అందరినీ చంపించేశాడు. ఎవరైనా కుట్రలు చేస్తున్నారని తెలిస్తే చాలు కాల్చిపడేశాడు. ఉత్తరకొరియాకు తనకు తానే నియంతగా మారి క్రూరంగా పాలిస్తున్నాడు. అత్యంత రహస్య జీవితం గడుపుతూ ఎక్కడ ఎప్పుడు ఉంటాడో తెలియకుండా భయంభయంగానే జీవిస్తున్నాడు. బయట ఎప్పుడూ కనిపించడు కూడా. అలాంటి కిమ్ జాంగ్ తాజాగా ఆశ్చర్యపరిచాడు. ప్రపంచానికి తన కుటుంబంలోని ఓ కొత్త వ్యక్తిని పరిచయం చేసి సర్ ప్రైజ్ చేశాడు.

కిమ్ జాంగ్ ఉన్ ఉత్తరకొరియా నియంత అయ్యాక కుటుంబ వివరాలను చాలా రహస్యంగా ఉంచాడు. ఆయన భార్య ఎవరు? పిల్లల పేర్లు, ఫొటోలు కూడా బయటకు రాకుండా దాచేశాడు. అలాంటి ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మొట్టమొదటిసారి ప్రపంచానికి తన కూతురును పరిచయం చేశాడు. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సందర్భంగా కూతురును బహిరంగ ప్రదేశానికి తీసుకొచ్చాడు. ఆమె పేరేంటి, వయసు ఎంత అనేది ఇప్పటికీ ఆ దేశంలోనూ ఎవరికీ తెలియదంటే అతడు ఎంత భద్రంగా తన కూతురును పెంచుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
అమెరికా ఈ ఖండాతర క్షిపణి ప్రయోగాన్ని వ్యతిరేకించి ఒత్తిడి తెచ్చినా బెదరకుండా కిమ్ జాంగ్ తాజాగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించాడు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు తన కూతురును వెంటపెట్టుకొని రావడం విశేషం. తెల్లటి కోటు ధరించిన కూతురును చేయి పట్టుకొని మరీ కిమ్ వచ్చాడు. కిమ్ జాంగ్ రిలాక్స్ గా ఉన్నాడని.. దేనికి భయపడబోనని సంకేతాలు ఇచ్చేందుకే ఇలా కూతురును బహిరంగ పరచాడని అమెరికా నిపుణులు అంచనావేస్తున్నారు.

కిమ్ జాంగ్ కూతురు పేరు ‘జు ఏ’ అని అంటున్నారు. ఆమె వయసు 12-13 ఏళ్లు ఉంటుందని అంచనా. మరో నాలుగేళ్లు ఆమె యూనివర్సిటీ చదువు ఉందని.. ఆ తర్వాత ప్రభుత్వ పాలనలోకి లేదంటే సైనిక సేవలోకి వెళుతుందని అంటున్నారు.
So, Kim Jong-un just decided to reveal his daughter for the first time publicly at an ICBM launch??? pic.twitter.com/tiE8gWixAJ
— Joseph Dempsey (@JosephHDempsey) November 18, 2022