సాధారణంగా ఏదైనా కొత్త ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో హోటల్ లేదా హాస్టల్ లో ఉండటానికి ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద నగరాల నుంచి చిన్న గ్రామాల వరకు హోటళ్లలో ఉచితంగా ఉండటానికి ఎవరూ అనుమతి ఇవ్వరు. అయితే అమెరికాలోని ఒక ప్రాంతంలో మాత్రం ఎన్ని రోజులైనా ఉచితంగా ఉండవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్లాబ్ సిటీలో కేవలం 150 ఇళ్లు మాత్రమే ఉన్నాయి.
Also Read: రాంచరణ్ బలం ఏంటో తెలుసా? వైరల్ ఫొటో
కాలిఫోర్నియా ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో అక్కడ చట్టాలు, నిబంధనలు ఉండవు. అందువల్ల అక్కడి ప్రజలు కరెంట్, నీటి సరఫరాకు ఎటువంటి ట్యాక్స్ లను చెల్లించాల్సిన అవసరం ఉండదు. దాదాపు 90 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అమెరికా ఆర్మీ బేస్ క్యాంప్ ఉండేది. ఆ సమయంలో ఆర్మీ సిబ్బంది నివాసం ఉన్న భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం.
Also Read: ఉప్పెన ఊపేసింది.. వారం రోజుల్లో రూ.70 కోట్లతో రికార్డ్
ఆ ఇళ్లలో ఎన్ని రోజులు నివాసం ఉన్నా ఒక్క రూపాయి కూడా రెంట్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్లాబ్ సిటీలో నివశించే వాళ్లలో ఎక్కువమంది ఆర్టిస్టులు కావడంతో ఆ సిటీలో ఎక్కడ చూసినా పెయింటింగ్స్ ఎక్కువగా దర్శనమిస్తాయి. అక్కడ నివశించే వాళ్లు సమీపంలోని గ్రామాలకు వెళ్లి నిత్యావసర సరుకులను కొనుగోలు చేస్తారు. ఇళ్ల గోడలు, కార్లపై పెయింటింగ్ లే దర్శనమిస్తాయి.
అగ్ర రాజ్యంలో ఉచితంగా నివాసం ఉండే ప్రాంతం ఉండటం విశేషం. ఎలాంటి పాత వస్తువునైనా కలర్ ఫుల్ గా మార్చేంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ లు ఈ గ్రామంలో ఉన్నారు. టూర్ లకు వెళ్లడానికి ఇష్టపడే వాళ్లు ఈ ప్రాంతానికి వెళితే మంచిది.