https://oktelugu.com/

ప్రతీకారం బిట్టు శ్రీనుదా..? కుంట శ్రీనుదా..? : పాలుపంచుకున్నదెవరు..?

లాయర్‌‌ వామన్‌రావు దంపతుల హత్య కేసు రోజుకో మలుపు తిప్పుతోంది. ఈ కేసులు పోలీసులు చెప్పిన కారణాలు పసలేనివని తేలిపోయింది. గ్రామంలోని వివాదాల కారణంగా ఇద్దరు హైకోర్టు లాయర్లను ఇంత దారుణంగా హత్య చేస్తారా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ వినిపిస్తోంది. అయితే.. వామన్‌రావు గ్రామానికే చెందిన కుంట శ్రీను మాత్రమే ఈ సీన్‌లో ఉన్నంతవరకు ఈ అనుమానాలకు బలం ఉండేది. కానీ.. ఎప్పుడైతే పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌‌ మేనల్లుడైన బిట్టు శ్రీను పేరు […]

Written By: Srinivas, Updated On : February 20, 2021 1:17 pm
Follow us on

Lawyer couple murder
లాయర్‌‌ వామన్‌రావు దంపతుల హత్య కేసు రోజుకో మలుపు తిప్పుతోంది. ఈ కేసులు పోలీసులు చెప్పిన కారణాలు పసలేనివని తేలిపోయింది. గ్రామంలోని వివాదాల కారణంగా ఇద్దరు హైకోర్టు లాయర్లను ఇంత దారుణంగా హత్య చేస్తారా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ వినిపిస్తోంది. అయితే.. వామన్‌రావు గ్రామానికే చెందిన కుంట శ్రీను మాత్రమే ఈ సీన్‌లో ఉన్నంతవరకు ఈ అనుమానాలకు బలం ఉండేది. కానీ.. ఎప్పుడైతే పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌‌ మేనల్లుడైన బిట్టు శ్రీను పేరు కూడా వెలుగులోకి వచ్చిందో ఆ అనుమానాలు మరింత రెట్టింపయ్యాయి.

Also Read: జగన్‌ వ్యూహంలో టీడీపీ చిక్కుకుందా..?

కుంట శ్రీనుకు వామన్‌రావుతో గ్రామంలోని పలు అంశాల్లో విభేదాలున్నాయనేది స్థానికంగా అందరికీ తెలిసిందే. ఆ కారణంగానే అతడు ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని మొదట భావించారు. పోలీసులూ అదే మాట చెప్పారు. అయితే.. కుంట శ్రీనును విచారించాక బిట్టు శ్రీను పాత్ర వెలుగు చూసింది. హత్య సమయంలో వినియోగించిన కారుతోపాటు కత్తుల్ని సమకూర్చింది బిట్టు అని తేలడంతో కేసు కీలక మలుపు తిప్పింది. మొదట అతడు వ్యక్తిగత కక్షలతోనే దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఇక్కడే పోలీసుల చేతికి మరోబలమైన అస్త్రం కూడా దొరికింది.

మంథని పట్టణంలోని ఓ కూడలిలో లభించిన సీసీ కెమెరా ఫుటేజీలో కీలక ఆధారం లభించింది. బిట్టు శ్రీను నిందితుడు కుంట శ్రీనుకు నేరుగా ఆయుధాలను అందించిన విషయం ఆ కెమెరాల్లో రికార్డయినట్లు సమాచారం. దాన్ని చూపించడంతో అతడు బిట్టు శ్రీను పాత్ర గురించి ఒప్పుకోక తప్పలేదని తెలిసింది. వాస్తవానికి వామనరావుతో కుంట శ్రీనుకు వ్యక్తిగతంగా శత్రుత్వం ఉందే తప్ప బిట్టు శ్రీనుతో లేదనేది స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఆ మాత్రానికి వామనరావును చంపించేంత అవసరం అతడికి ఎందుకు వచ్చిందనేది నిగ్గు తేలాల్సిన అంశం. పోలీసులు కూడా ఆ విషయాన్ని కచ్చితంగా విశ్లేషించలేకపోతున్నారు.

Also Read: పంచాయతీ పోరులో రాజకీయ దుమారం

పుట్ట మధు తల్లి లింగమ్మ పేరిట ఉన్న చారిటబుల్‌ ట్రస్ట్‌కు బిట్టు శ్రీను చైర్మన్‌గా ఉండేవాడు. ఈ ట్రస్టు కార్యకలాపాల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని.. ఆదాయ, వ్యయాలపై తప్పుడు లెక్కలు చూపుతున్నారని.. నిధులను మళ్లిస్తున్నారని మాజీ వార్డు స్యభ్యుడు ఇనుముల సతీష్‌ 2018లో ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై వామన్‌రావు భార్య నాగమణి ద్వారా హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. దీనివల్ల ట్రస్టు నిర్వహణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పుట్ట మధు ఓటమి పాలయ్యాక.. ట్రస్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనికంతటికీ వామన్‌రావు దంపతులే కారణమనే కోపంతో బిట్టు శ్రీను ఈ జంట హత్యలకు ప్లాన్‌ చేసి ఉంటాడా..? అనే అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్