Nithyananda Swami : శాస్త్ర సాంకేతిక రంగాలు ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెత తెలిసినప్పటికీ.. స్వామీజీల వద్దకు దేశాన్ని పరిపాలించే నేతలు రావడం నిజంగా హాస్యాస్పదం. అప్పట్లో ఇలాంటి స్వామీజీల దొంగ ముసుగులు బయటికి తీయడానికి శాంతి క్రాంతి అనే ఓ సినిమా వచ్చింది. కానీ అంతటి సినిమా కూడా జనాల ఆలోచన తీరును మార్చలేకపోయింది. స్వామీజీల పుట్టుకను అడ్డుకోలేకపోయింది. మన రాజకీయ ప్రతినిధులకు జనాల ఓట్లు కావాలి. ఆ ఓట్లు కావాలంటే ఇలాంటి స్వామీజీల అండ కావాలి. అందువల్లే వారి శరణు జొచ్చుతారు. పాహి అంటూ పాదాల మీద పడతారు. ఆ క్షణం వరకు నటిస్తారు.. స్వామీజీల భక్తులు గుంప గుత్తగా ఓట్లు వేసిన తర్వాత.. సైలెంట్ అయిపోతారు.. డేరా బాబా అన్ని అక్రమాలు చేశాడని తెలిసినప్పటికీ.. ఇంతవరకు అతనికి కఠిన శిక్ష పడిన దాఖలాలు లేవు. పైగా ఎన్నికల సమయంలో అతనికి బెయిల్ కూడా వచ్చింది. ఇక ఆ మధ్య ఉత్తర ప్రదేశ్ లో తొక్కిసలాటకు కారణమైన ఓ బాబాకు మన వ్యవస్థలు ఎలాంటి రక్షణ కల్పించాయో చూశాం కదా.. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఈ బాబా ట్రెండు వేరు.. ఈ బాబా సృష్టించిన ట్రెండ్ సెట్టింగ్ కూడా వేరు..
Also Read : త్రిభాషా విధానంపై వివాదం.. యోగి–స్టాలిన్ డైలాగ్ వార్!
చనిపోయాడట
అతడు పేరు నిత్యానంద.. చేసేదేమో ఆధ్యాత్మికం.. పైకేమో స్వామీజీ.. లోపల మాత్రం తన భక్తురాలితో సరస సల్లాపాలు ఆడే భోగి జి. ఆదాయం కోసం ఆధ్యాత్మిక మార్గం పట్టిన అతడు.. ఎన్నో అక్రమాలు చేశాడు. మరెన్నో దారుణాలకు పాల్పడ్డాడు. అతనిపై మనదేశంలో ఎన్నో కేసులు ఉన్నాయి. మన వ్యవస్థలు తెలుసు కదా.. అందులో ఉన్న లోపాలు అతనికి అవకాశం గా మారాయి. ఇంకేముంది దేశం వదిలి వెళ్ళిపోయాడు.. కొత్తగా కైలాసగిరి అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చాడు. అందులోకి నివాసం ఏర్పాటు చేసుకోవడానికి డబ్బులు కూడా వసూలు చేశాడు. వెర్రి గొర్రెల లాంటి భక్తులు అతడు చెప్పినట్టు చేశారు. అతడు అడిగినంత ముట్టు చెప్పారు. ఇంతవరకు కైలాసగిరి ఎలా ఉందో తెలియదు.. అది ఎక్కడ ఉందో తెలియదు.. అయితే ఇప్పుడు అతడు చనిపోయాడట. ఇదే విషయాన్ని నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ బయటికి వెల్లడించాడు.” నిత్యానంద కన్నుమూశారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆయన ప్రాణ త్యాగం చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆయన తన వంతు కృషి చేశారు. ఇప్పుడు తన ప్రాణాలను త్యాగం చేశారని” సుందరేశ్వరన్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిత్యానంద పై మనదేశంలో కేసులు ఉన్నాయి. ఇతర దేశాల్లోనూ కేసులు ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఆయన అనేక అక్రమాలు చేశారని.. ఆయనను అరెస్టు చేస్తారని అప్పట్లో వార్తలు వినిపించాయి. తన ఆశ్రమంలో పనిచేస్తున్న ఓ సినీ నటిని ఆయన లొంగదీసుకున్నారని.. ఆమె మనసును పూర్తిగా మార్చేశారని అప్పట్లో కథనాలు కూడా ప్రసారమయ్యాయి. ఇప్పుడిక నిత్యానంద చనిపోవడంతో ఒక్కసారిగా సంచలనం నమోదయింది.. అయితే కేసుల వల్లే నిత్యానంద చనిపోయారనే వార్తలు ప్రచారం చేస్తున్నారని.. జనాలను ఏప్రిల్ ఫూల్స్ చేయడానికి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని.. సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..”భక్తి ముసుగులో అక్రమాలకు పాల్పడిన వ్యక్తిత్వం నిత్యానందది. అతడు తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి చనిపోయాడనే నాటకాలు ఆడుతున్నాడు. జనాలను ఏప్రిల్ పూల్స్ చేస్తున్నాడని” నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read : అంతరిక్షం నుంచి భారత్ ఎలా ఉంటుందో తెలుసా.. సునీతా విలియమ్స్ అనుభవం