హిందూ ఆలయంలో న్యూజిలాండ్ ప్రధాని.. అసలు కారణం ఏంటంటే?

ప్రపంచ దేశాలలో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో కొన్ని దేశాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అలా వైరస్ ను కట్టడి చేసిన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. 102 రోజుల పాటు న్యూజిలాండ్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే వైరస్ ను కట్టడి చేయడంలో సక్సెస్ కావడంతో ఆ దేశ ప్ర‌ధాని జెసిండా ఆర్డర్న్ పై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా జెసిండా ఆక్లాండ్ లోని రాధాకృష్ణుల ఆలయాన్ని […]

Written By: Kusuma Aggunna, Updated On : August 13, 2020 4:38 pm
Follow us on

ప్రపంచ దేశాలలో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో కొన్ని దేశాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అలా వైరస్ ను కట్టడి చేసిన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. 102 రోజుల పాటు న్యూజిలాండ్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే వైరస్ ను కట్టడి చేయడంలో సక్సెస్ కావడంతో ఆ దేశ ప్ర‌ధాని జెసిండా ఆర్డర్న్ పై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా జెసిండా ఆక్లాండ్ లోని రాధాకృష్ణుల ఆలయాన్ని సందర్శించారు.

ప్రధాని ఆలయాన్ని సందర్శించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా వైరస్ నియంత్రణలో సక్సెస్ కావడం వల్లే ప్రధాని దర్శనానికి వెళ్లారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రధాని చెప్పులను ఆలయం బయట వదిలి… హారతి పూజలో పాల్గొని ప్రసాదం తీసుకొని పూరీ, పప్పును తింటున్న ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

గతంలో కరోనా కేసులు నమోదు కాని సమయంలో సైతం ప్రధాని జెసిండా హిందూ ఆల‌యానికి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. తాజాగా జెసిండా మరోసారి గుడికి వెళ్లడం వాస్తవం అయినా ఆమె వచ్చే నెలలో జరిగే ఎన్నికలు జరగబోతూ ఉండటంతో ఆలయానికి వెళ్లారని కరోనా కేసులు నమోదు కాకపోవడం వల్ల కాదని అధికారిక వర్గాల సమాచారం. క‌రోనాను క‌ట్ట‌డి చేసినందుకు జెసిండా ఆలయానికి వెళ్లారని వస్తున్న వార్తలు నిజం కాదు. మరోవైపు 102 రోజుల పాటు కేసులు నమోదు కాని న్యూజిలాండ్ లో నిన్న కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి.