కేంద్రం కరోనా బులిటెన్ మారినా.. పక్కనున్న ఏపీ కరోనా బులిటెన్ లో కేసులు ఎక్కువ అవుతున్నా.. తెలంగాణ కరోనా బులిటెన్ లో మాత్రం మార్పు రావడం లేదన్న చర్చ మీడియా వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే ఠంచనుగా కేసీఆర్ సర్కారు 2వేల లోపు కేసులను మాత్రమే ప్రతీరోజు చూపిస్తోంది. టెస్టుల సంఖ్యను 40వేల వరకు పెంచినా కూడా కేసులను మాత్రం 2వేలకే కంట్రోల్ చేస్తోందన్న చర్చ సాగుతోంది.
Also Read: కరోనా ఎఫెక్ట్.. ప్రైవేట్ అంబులెన్సుల అడ్డగోలు దందా
రాష్ట్ర స్థాయి కరోనా హెల్త్ బులిటెన్ కు.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చే హెల్త్ బులిటెన్ కు తెలంగాణలో చాలా తేడాలుంటున్నాయన్న విమర్శలున్నాయి. జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాల్లో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. కానీ రాష్ట్ర బులిటెన్ లో మాత్రం 2వేల లోపు మాత్రమే కేసులు ఆగిపోతున్నాయి. జిల్లాలో తీవ్రతకు.. రాష్ట్రంలో కేసులకు పొంతన లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతీరోజు పదుల సంఖ్యలో కరోనా కేసుల విషయంలో రాష్ట్రస్థాయికి.. జిల్లా స్థాయి హెల్త్ బులిటెన్లకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.
ముఖ్యంగా మెట్రో పాలిటన్ సిటీ అయిన హైదరాబాద్ లో కేసుల తీవ్రత అధికంగా ఉంది. చాలా మందికి సోకుతోంది. ఇక జిల్లాలకు కరోనా బాగా విస్తరిస్తోంది. కానీ ఈ కేసుల లెక్కలెవీ రాష్ట్రస్థాయి బులిటెన్ లో కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: గోల్కొండలో ఆగస్టు 15 వేడుకలు ఉండవా?
ఇక తెలంగాణ సర్కార్ మృతదేహాల లెక్కలను దాస్తోందన్న ప్రచారం సాగుతోంది. బులిటెన్ లో మాత్రం కరోనా మృతులను తక్కువగా వేస్తుండడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. బయట మాత్రం కరోనా మృతుల సంఖ్యను మీడియాల్లో బాగా చూపిస్తున్నారు. దీంతో మొత్తంగా తెలంగాణ బులిటెన్ లో ఏదో మతలబు ఉందన్న అనుమానాలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి.
తెలంగాణలో కరోనా కల్లోలాన్ని కేసీఆర్ సర్కార్ దాచేస్తోందా అన్న భయాలు నెలకొంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వెల్లడించే కేసులకు.. క్షేత్రస్థాయిలో కేసులకు చాలా తేడా ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అన్నింటిని వెల్లడించాలని.. కరోనా తీవ్రతను ప్రజలకు తెలుపాల్సిన బాధ్యత ఉందని ప్రజలు కోరుతున్నారు. దాచడం వల్ల మరింతగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.