Project K Making Video: ప్రాజెక్ట్ కే మూవీపై భారీ అంచనాలున్నాయి. ఒక్కొక్క అప్డేట్ ఆసక్తి పెంచేస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఓ స్పెషల్ మేకింగ్ వీడియో షేర్ చేశారు. సినిమాలో వాడే ఒక టైర్ కోసం రోజుల తరబడి వర్క్ చేసినట్లు ఆ మేకింగ్ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ప్రాజెక్ట్ కే కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రాచ్ టెక్నాలజీ వాడుతున్నట్లు తెలుస్తుంది. మూవీలో వాడే వాహనాలు, వస్తువులు స్క్రాచ్ నుండి ప్రిపేర్ చేయాలని నాగ్ అశ్విన్ మేకింగ్ వీడియోలో చెప్పారు. స్క్రాచ్ అనేది విజువల్ ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రాజెక్ట్ కే మేకింగ్ లో భాగమైంది.

మొత్తంగా కష్టపడి ఒక టైర్ తయారు చేశారు. ఆ టైర్ ఎలా వాడుతారో అనేది ఆసక్తి రేపుతోంది. ఆ టైర్ కథలో ఒక భాగమా లేక అలాంటి టైర్స్ తో కూడిన వాహనాలు సినిమాలో వాడనున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఆ మధ్య బిజినెస్ మాన్ ఆనంద్ మహీంద్రాకు నాగ్ అశ్విన్ ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ప్రాజెక్ట్ కే మూవీలో వాడే కార్లకు సంబంధించిన ఇంజనీరింగ్ సాంకేతికత విషయంలో సహాయం అందించాలని సోషల్ మీడియా వేదికగా కోరారు . నాగ్ అశ్విన్ అభ్యర్ధనకు ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆయన కచ్చితంగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో మహేంద్ర వాహనాలకు ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
రూ. 500 కోట్లు పైగా బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అని, టైం ట్రావెలింగ్ కథలో ప్రధాన అంశం అని ప్రచారం జరుగుతుంది. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫస్ట్ టైం టాలీవుడ్ మూవీలో దీపికా పదుకొనే చేస్తున్నారు. అలాగే దిశా పటాని మరో హీరోయిన్. వైజయంతీ మూవీ బ్యానర్ లో సి అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్ లో లాంగ్ షెడ్యూల్ చిత్రీకరించారు. ప్రాజెక్ట్ కే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో లేదు 2024 లో ప్రాజెక్ట్ కే ప్రేక్షకుల ముందు రానుంది. మహానటి మూవీతో భారీ విజయాన్ని అందుకున్న నాగ్ అశ్విన్ గత ఐదేళ్లుగా ఈ చిత్రంపై పని చేస్తున్నారు. మధ్యలో చిన్న ఆంథాలజీ సిరీస్ చేసిన నాగ్ అశ్విన్ పూర్తి సమయం ప్రభాస్ మూవీ కోసం కేటాయిస్తున్నారు.
Starting our making series at the end of the year…
Here’s the sneak peek into our world. #ProjectK
‘ : – ‘: https://t.co/SjZmt5mPpD#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/oCupUpc5Am
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 31, 2022