Cohabitation: కట్టు బొట్టు.. సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రపంచ దేశాలకు భారతీయులు ఆదర్శం. ఇది ఎవరూ కాదనలేని నిజం. భారతీయుడిగా విశ్వవేదికలపై మనం గర్వంగా చెప్పుకునే అంశం. విదేశీయులు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుంటే.. భారతీయులు మాత్రం పాశ్చాత్య పోకడలతో ఆగమైపోతున్నారు. వికృతమైన విదేశీ సంస్కృతిని భారతీయ గడ్డపై వ్యాపింపజేస్తున్నారు. తాజాగా రిలేషన్‌షిప్ పేరుతో విచ్చలవిడి లైంగిక సంబంధాలు నెరుపుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ ఇలాంటి వారికి అవకాశం కల్పిస్తోంది. కరోనా కాలం నుంచి ఇది శృతిమించుతోంది. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన చాలామంది ఇంటర్నెట్ సెర్చింగ్ మొదలు పెట్టారు. ఇందులో అశ్లీలతకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని సర్వేలు కూడా నిర్ధారించాయి. ఇంకా కఠినమైన వాస్తవం ఏమిటంటే పురుషుల కంటే.. స్త్రీలే అశ్లీల సైట్లు సెర్చ్ చేయడం. భారతీయ మహిళ ఉన్న గొప్ప గౌరవం ఇలాంటి తీరుతో సన్నగిల్లుతోంది. మరోవైపు పాశ్చత్య పోకడలు, స్వేచ్ఛ పేరుతో సంద్రాయ కట్టు బొట్టు వదిలేస్తున్నారు. విచ్చలవిడి డ్రెస్సింగ్‌తో పురుషులకు ఆకర్శిస్తున్నారు. రిలేషన్‌షిప్ పేరుతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారు.

-కొత్త కొత్త పేర్లు..
లైంగిక సబంధాలు కొనసాగించేందుకు కొత్తకొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ యాప్‌లలో సహజీవనానికి ఆసక్తి ఉన్న స్త్రీ, పురుషుల వివరాలు అందుబాటులో ఉంటున్నాయి. వీటిద్వారా సెక్స్ సంబంధాలు పెంచుకుంటున్నారు. ఒకవర్గం వారి బహుభార్యత్వాని బహిరంగంగా తప్పు పడుతున్నాం. కానీ మనం.. ఏం చేస్తున్నామో మర్చిపోతున్నాం.. వారి వైవాహిక బంధంతో లైంగిక సంబంధాలు నెరపుతుంటే.. మనం మాత్రం అక్రమ సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దీనికి కొత్తకొత్త పేర్లు పెట్టుకుంటున్నాం. కొందరు ఓపెన్ రిలేషన్ అంటే ఇంకొందరు హార్టింగ్, రోచింగ్, బ్రెడ్ కంబింగ్, లవ్ బాంబింగ్ ఇలా పేర్లు పెట్టుకుని సహజీవనం చేస్తున్నారు. డబ్బుల కోసం కొందరు, సెక్స్ వాంఛ తీర్చుకోడానికి కొందరు.. ఎంజాయ్ పేరుతో మరికొందరు ఇలాంటి వాటికి ఆకర్షితులవుతున్నారు.
-నాడు చూసేందుకే భయపడే పరిస్థితి..
రెండు దశాబ్దాల క్రితం వరకు అమ్మాయిలవైపు కన్నెత్తి చూడడానికి అబ్బాయిలు, అబ్బాయిలతో మాట్లాడడానికి అమ్మాయిలు జంకే పరిస్థితి ఉండేది. సమాజం కూడా ఇలాంటి వాటిని సహించే పరిస్థితి లేదు. కానీ క్రమంగా పరిస్థితి మారుతూ వస్తోంది. ఒకప్పుడు బాల బాలికలకు వేరుగా ఉన్న స్కూళ్లు ఇప్పుడు కో ఎడ్యుకుషన్‌గా మారాయి. ఇక కాలేజీలకు వచ్చే సరికి అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చునే పరిస్థితి. కంబైన్డ్ స్టడీ చేసే స్వేచ్ఛ.. గదులు అద్దెకు తీసుకుని స్టడీ పేరుతో సహజవనం చేసే వీలు ఉంటోంది. పెరిగిన ఉరుకులు పరుగుల జీవితంలో వీటిని పట్టించుకునేవారు కరువయ్యారు. కొందరు తెలిసినా మనకెందుకులే అని వదిలేస్తున్నరు. మరికొందరు తమకూ అవకాశం దొరుకుతుందా అని వేచిచూస్తున్నారు.

-మాయమైపోతున్న ప్రేమ, పెళ్లి, అనుబంధం..
నేటి సమాజంలో పాశ్చాత్య పోకడలు పెరిగి మనుషుల మధ్య ప్రేమ మాయమవుతోంది. ఆప్యాయత కనిపించడం లేదు. పెళ్లి చేసుకున్నా కలిసే ఉంటారని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అనుబంధాలు అయితే అసలే కనిపించడం లేదు. న్యాయస్థానాలు కూడా సహజీవనం తప్పు కాదని తీర్పులు ఇవ్వడం.. పోలీసులు పట్టుకున్నా.. రిలేషన్ షిప్‌లో ఉన్నామని చెప్పడంతో ఏమీ చేయలేని పరిస్థితి చూస్తుంటే మరో ఏడాదిలోనే విదేశీ విశృంఖల సంస్కృతి విచ్చలవిడిగా మారే పరిస్థితే కనిపిస్తోంది.