New Year 2025: 1: ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు..(మొత్తం కూడితే ఒకటి రావడం)
వీరికి శక్తివంతమైన సంవత్సరంగా ఉండనుంది. వ్యక్తిగత లక్ష్యాలను కొనసాగిస్తారు. కొత్త సవాళ్లను స్వీ కరిస్తారు. నాయకత్వ బాధ్యతలు చేపడతారు. దీర్ఘకాలంగా ఆలోచించిన ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ప్రేరణ సమకూరుతుంది. మానసికంగా ఇతరులతో మీ సంబంధాలలో సమతుల్యత సాధించడంపై విజయం ఆధారపడి ఉంటుంది.
2 : (ఏదైనా నెలలో 2, 11, 20,29 తేదీలలో జన్మించినవారు)
ఈ సంవత్సరం మీరు సాధారణంగా నాయకత్వం వహించని ప్రాంతాల్లో మిమ్మల్ని మీరు బయట పెట్టాలనే సహజమైన కోరికను కలిగి ఉంటారు. బాహ్యస్థాయి ఒత్తిళ్లకు లోనుకాకుండా మీలో సమతుల్యం చేసుకోవాలి. సంవత్సరంలోని వివిధ త్రైమాసికాలు వివిధ రకాల ప్రకంపనలు, అడ్డంకులు, అవకాశాలను కలిగి ఉంటాయి.
3 : (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు)
ఈ నంబర్ వారిలో గొప్ప మార్పు కనిపిస్తుంది. వీరి వ్యక్తిత్వాలు సహజంగా సృజనాత్మకంగా, కమ్యూనికేటివ్‌గా ఉంటాయి. ఎదుగుదల, జ్ఞానం కోసం తపన ఉంటుంది. వీరి సహజమైన ఆశావాదం, కళాత్మక అభిరుచులు వీరిని ఏ రంగంలోనైనా నిలబెట్టేలా చేస్తాయి. వ్యక్తిగత, వృత్తిపరమైన రంగాలలో వృద్ధికి అవకాశాలను అందిస్తుంది.
4 (ఏదైనా నెలలో 4, 13, 22, 31వ తేదీన పుట్టినవారు)
వీరు కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు. సమూహం లేదా సంస్థకు వెన్నెముకగా నిలుస్తారు. గందరగోళాన్ని నివారించడానికి క్రమశిక్షణను కొనసాగించడం చాలా ముఖ్యం.
5 : (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు)
వీరి కెరీర్, సంబంధాలు , వ్యక్తిగత వృద్ధితో సహా జీవితంలోని వివిధ రంగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణం, కొత్త అనుభవాలు, విజయ అవకాశాలను మెరుగుపరుస్తాయి.
6 : (ఏదైనా నెలలో 6, 15, 24వ తేదీన పుట్టినవారు)
ఇది మీకు వనరుగా, అనువైనదిగా, సిద్ధంగా ఉండాలని కోరే సంవత్సరం. మీ కెరీర్, సంబంధాలు, వ్యక్తిగత ఎదుగుదలకు దోహదపడుతుంది. మీరు ఆలోచించిన రంగాల్లో అవకాశాలను తెస్తుంది. ప్రత్యేకించి ప్రయాణం, కొత్త అనుభవాలు, వ్యక్తిగత వృద్ధికి దోహదం చేస్తాయి. లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం అవసరం.
7 : (ఏదైనా నెలలో 7, 16 లేదా 25వ తేదీన పుట్టినవారు)
మీ కంఫర్ట్ జోన్‌ను దాటి అడుగులు వేయమని,పరిస్థితులపై లోతైన అవగాహన నుంచి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని బలంగా ప్రోత్సహించే శక్తులను మిళితం చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గం కోసం మీ కోరిక ఈ సంవత్సరం బలమైన మార్గాన్ని కనుగొంటుంది.
8 : (ఏదైనా నెలలో 8, 17, 26వ తేదీన పుట్టినవారు)
కొన్ని సమయాల్లో, శనితో అంగారక గ్రహం పరస్పర చర్య ఘర్షణకు కారణం కావచ్చు. ఈమేరకు జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించడానికి దోహదపడుతుంది. ఇది మీ సహనాన్ని పరీక్షించే సంవత్సరం కూడా కావచ్చు. జీవితం, వ్యాపారం, ఆర్థిక సంబంధాలు, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి కీలకమైన రంగాలపై దృష్టి సారించాలి..
9: (ఏదైనా నెలలో 9, 18, 27వ తేదీన పుట్టినవారు)
మీరు విషయాలను లోతుగా పరిశోధించగలుగుత్తారు. మీ పుట్టిన సంఖ్యతో సమానమైన వైబ్రేషన్‌ను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం మీ జీవితసంలో గొప్ప మార్పలు చోటుచేసుకుంటాయి.