Homeట్రెండింగ్ న్యూస్Rishi Sunak: రిషి సునక్‌ మన కులపోడేనా.. మీరు మారరార బాబు?

Rishi Sunak: రిషి సునక్‌ మన కులపోడేనా.. మీరు మారరార బాబు?

Rishi Sunak: మనల్ని 200 ఏళ్లు పాలించిన దేశానికి మన వాడే పాలకుడు అయ్యాడు. తెల్లదొరలు భారత దేశాన్ని 200 ఏళ్లు పాలించారు. కానీ మన భారతీయుడు ఆ దేశానికి పాలకుడు కావడానికి ఎంతో కాలం పట్టలేదు. కేవలం 76 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో పుట్టిన 42 ఏళ్ల వ్యక్తి.. నాలుగు రోజుల్లో బ్రిటిష్‌ ప్రధాని పీటం అధిరోహించనున్నాడు. అయితే ఆయన బ్రిటిష్‌ పాలకుల్లా దండయాత్ర చేయలేదు. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో యుద్ధం చేయలేదు. అక్కడి ప్రజల మనసును గెలుచుకున్నాడు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రధాని పదవికి ఎన్నికయ్యాడు.

Rishi Sunak
Rishi Sunak

పేరులో అర్థాన్ని వెతుకుతున్నారు..
బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునక్‌ ఎన్నికసై అధికారిక ప్రటన సోమవారం సాయంత్రం వెలువడింది. ఈ నేపథ్యంలో భారతీయులు, ఇతర నెటిజన్లు ఇప్పుడు ఆయన పేరులో అర్థాన్ని ఆరా తీస్తున్నారు. సునక్‌ అంటే ఏమిటి.. సునక్‌ పదం సరైనదేనా.. ఇంది హిందూ సంప్రదాయం ప్రకారం ఉందా.. లేదా అని సెర్చ్‌ చేస్తున్నారు. చాలా మంది హిందూ పేరు నిపుణులు అది ‘సౌనక్‌’ అని ఉండాలి కానీ, సునక్‌ కాదు అని అంటున్నారు. సునక్‌ అనే పేరు సంస్కృతంలో ‘కుక్క’ అని అర్ధం, అయితే సౌనక్‌ అంటే హిందూ పురాణాలలో ఒక సాధువు పేరు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన బ్రిటన్‌ ప్రధాని పేరుపై సోషల్‌ మీడియా వేదికల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి.

తప్పుగా రాశారేమో అని..
భారతదేశంలో సర్వసాధారణంగా పొరపాట్లు జరిగినట్లుగా బ్రిటిష్‌ విద్యా రికార్డులలో అతని పేరు తప్పుగా రాసి ఉండవచ్చని కొందరు ఊహిస్తున్నారు.

అయితే కొందరు సునక్‌ అనేది పంజాబ్‌లోని అతని పూర్వీకుల ఇంటి పేరు అని పేర్కొటున్నారు. హిందూ పురాణాలకు రిషి సౌనక్‌తో సంబంధం లేదని ఉదహరిస్తున్నారు.

వీడని కుల జాఢ్యం..
ఇక మన భారతీయులు తమ సహజ శైలిలో రిషి సునక్‌ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఎక్కడైనా ఎవరికైనా మంచి పదవి, పేరు వస్తుందంటే ముందుగా మనవాళ్లు ఆరా తీసేది కులమే. పలాన వ్యక్తి మన కులం వాడేనా.. అతడిని మనం ఎలా కలుపుకుపోవాలి, మన అవసరాలకు ఆయన పేరును ఎలా వాడుకోవాలి అని అలోచిస్తారు. కుక్కు తోక వంకర అన్నట్లు కులం గురించి పట్టించుకోవద్దు, కుల జాఢ్యం వీడాలి అని చెప్పే నాయకులు కూడా తమ అవసరాలకు మాత్రం అదే కులం పేరు వాడుకుంటారు. ఇప్పుడు కూడా బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునక్‌ ఎన్నిక కావడం, అతడిని భాతీయ నేపథ్యం కావడంతో ఆయన కులం కోసం ఆసక్తిగా వెతుకుతున్నారు. వాస్తవానికి అతను బ్రాహ్మణుడైన అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నాడు, అయితే రిషి కులం ఇంకా తెలియదు. అతను శాఖాహారుడు, టీటోటేలర్‌ అని తెలిసి, అసలు కులాన్ని ప్రజలకు వెల్లడించనప్పటికీ, అతను బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతున్నాడని చాలా మంది భావిస్తున్నారు.

Rishi Sunak
Rishi Sunak

మీరు మారరా..
బ్రిటన్‌ ప్రధాని కులం కోసం నెట్టింట్లో వందలాది మంది సెర్చ్‌ చేసినట్లు గూగుల్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. బ్రిటన్‌ ప్రధానిగా మన భారతీయుడు ఎన్నికైనందుకు గర్వించాల్సిన సమయంలో కొంతమంది ఇలా కులం వెతకడంపై విమర్శలు వ్యక్తమువుతన్నారు. రిషిని మనం ఓన్‌ చేసుకుంటున్నా.. రిషి మనల్ని ఓన్‌ చేసుకుంటాడో లేదో తెలియదు. కానీ భారతీయులు మాత్రం ఇప్పటికే ఆయన కులం వెతుకుతూ తమ కులంవాడే అని చెప్పుకునేందుకు ప్రయత్నించడం నిజంగా బాధాకరం. శాస్త్ర సాంతికేతిక ఎంత అభివృద్ధి చెందినా భారతీయుల్లో ఇప్పటికీ కుల జాఢ్యం వీడలేదనడానికి ఇదే ఉదాహరణ.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version