Dasara Movie Teaser: నేచురల్ స్టార్ నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ‘దసరా’ అనే చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం నాని పడినంత కష్టం గతంలో ఆయన ఏ సినిమా కోసం కూడా పడి ఉండడు..కెరీర్ లో మొట్టమొదటిసారి ఊర మాస్ క్యారక్టర్ అవ్వడంతో నాని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఈరోజు విడుదల చేయగా ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.. ఇంత ఊర మాస్ టీజర్ ని ఈమధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదని.. ఈసారి నాని కొట్టబోయే దెబ్బ కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాని మాట్లాడిన మాటాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి..
ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘మన సౌత్ లో కాంతారా చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను..టీజర్ ని చూస్తే మీకు ఈపాటికి అర్థమైపోయి ఉండాలి..ఎంత మాస్ గా ఈ సినిమా వచ్చిందో అని’ అంటూ నాని ఎంతో కాన్ఫిడెంట్ గా ఈ సినిమా గురించి మాట్లాడాడు.

ఈ చిత్రం ద్వారానే శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు..సింగరేణి బొగ్గు నేపథ్యంలో సాగే ఈ కథ , పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం భాషలలో విడుదల కానుంది..నాని కి ఇటీవల కాలం లో హిట్స్ అయితే ఉన్నాయి కానీ, ఇండస్ట్రీని షేక్ చేసే హిట్ మాత్రం పడలేదు..ఆ లోటుని దసరా తీరుస్తుందని అంటున్నారు.
