Nani Dasara Telugu Teaser : మాస్ సబ్జెక్స్ ఇండియా వైడ్ అద్భుతాలు చేస్తున్నాయి. కెజిఎఫ్ 2, కాంతార చిత్ర విజయాలు ఎందరిలోనో స్ఫూర్తి నింపాయి. హైక్లాస్ సొసైటీ, కలర్ ఫుల్ లైఫ్స్ సిల్వర్ స్క్రీన్ మీద చూసి జనాలు విసిగిపోయారనిపిస్తుంది. నాటు పల్లెటూరి కథలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. రంగస్థలం వంటి చిత్రానికి క్లాస్, మాస్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అలాంటి ఓ డార్క్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు నాని. ఊర మాస్ డీగ్లామర్ రోల్ చేశారు. కృష్ణార్జున యుద్ధం మూవీలో నాని లుంగీ కట్టులో మాస్ రోల్ ట్రై చేశారు. దసరా మూవీలో బాగా డెప్త్ ఉన్న పల్లెటూరి మొరటు కుర్రాడిగా నటిస్తున్నారు. దసరా టీజర్ నేడు విడుదలైంది. పరిశ్రమను షేక్ చేసింది.

ఇంటెన్స్ రోల్ లో నాని మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. నడుము దగ్గర మందు, జేబులో బీడీ… నిద్రలేస్తూనే మత్తులో కెళ్లే రూత్ లెస్ పల్లెటూరు రెబల్ గా నాని క్యారెక్టర్ దర్శకుడు డిజైన్ చేశాడు. మంచో చెడో అనుకున్నది చేసేయడం , నచ్చనోడిని ఎదిరించడం నాని క్యారెక్టర్ షేడ్స్. ‘మందు మాకు వ్యసనం కాదు… అలవాటైన సాంప్రదాయం’ అని నాని చెప్పిన డైలాగ్ క్యారెక్టర్ గురించి ఓ ఐడియా ఇస్తుంది.
బొగ్గు గనుల మధ్య ఉండే వీర్లపల్లికి చెందిన యువకుడి కథే దసరా. బొగ్గు గనుల్లో కార్మికులుగా మగ్గిపోతున్న ఊరి జనాలకు ఆసాములకు మధ్య పోరుగా మూవీ కథ ఉండే అవకాశం ఉంది. సాధారణ కార్మికుడైన నాని రెబల్ ఎలా అయ్యాడు? పెత్తందారులను ఎలా ఎదిరించాడనేది మూవీలో ప్రధాన సంఘర్షణ కావచ్చు. కార్మికుల జీవితాలు, లోకల్ పాలిటిక్స్, శ్రమదోపిడి, జనాలు అమాయకత్వం కలగలిపి… ఓ విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరక్కించాడనిపిస్తుంది.
సాయి కుమార్ కీలక రోల్ చేస్తున్నారు. ఆయన్ని టీజర్లో చూడొచ్చు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమెను టీజర్లో పరిచయం లేదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగున్నాయి. మొత్తంగా దసరా టీజర్ అంచనాలకు మించి ఉంది. ముఖ్యంగా నాని తనలోని మరో అవతార్ చూపించాడు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 30న విడుదల చేస్తున్నారు.
