NASA: చంద్రుడిపైకి మానవుడిని తిరిగి పంపడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో సాహసోపేత ప్రయోగానికి రెడీ అయ్యింది. అత్యంత శక్తివంతమైన మానవ సహిత రాకెట్ ను చంద్రుడిపైకి నేడు పంపించనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ఈ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. దీనికి అర్టేమిస్ అనే పేరు పెట్టారు.

ఫోర్లిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ స్పేస్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. అర్టెమిస్1లో కమాండ్ సీటులో ఒక మనిషి బొమ్మ ఉంటుంది. దానికి ఫ్లైట్ సూట్ ను తొడిగారు. రేడియో ధార్మికత నుంచి ఇది ఎంత మేర వ్యోమగామిని రక్షిస్తుందన్నది పరీశీలిస్తారు. హెల్గా, జోహర్ అనే రెండు బొమ్మలను పంపిస్తున్నారు. మానవ కణజాలాన్ని సిమ్యులేట్ చేసే పదార్థంతో వీటిని తయారు చేశారు. ఇవి సుదూర అంతరిక్షయాత్రలకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేస్తాయి.
అర్టెమిస్ 1 యాత్ర ఆరువారాల పాటు సాగుతుంది. నిర్దేశిత సమయం తర్వాత రాకెట్ తో ఒరాయన్ (మనిషి బొమ్మ ఉన్న లూనార్) విడిపోతుంది. చంద్రుడి దిశగా సాగే ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ పథంలోకి వెళుతుంది.

ఈ రాకెట్ లో ఒక శక్తివంతమైన రాకెట్ తోపాటు వ్యోమనౌకలు నింగిలోకి వెళతాయి. 1969లో అమెరికా చంద్రుడిపైకి అపోలో మిషన్ లో మనుషులను పంపింది. మూడు రోజులకు మించి చంద్రుడిపై మనుషులు లేరు. ఇప్పుడు శాశ్వతి నివాసం కోసం ఈ యాత్ర చేపడుతున్నారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత చంద్రుడిపైకి మళ్లీ మానవుడిని తీసుకెళ్లే యాత్రకు పురుడుపోశారు.
https://www.youtube.com/watch?v=5THwJgxJGv0