Pakistan Torrential Rains: మానవ తప్పిదాల వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. కానీ వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రకృతి మానవ మనుగడకే ముప్పుగా పరిణమిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు మనుషులను భయపెడుతున్నాయి. అయినా మానవుల్లో మార్పు కనిపించడం లేదు. ఓ పక్క కరువు పరిస్థితులు కరాళ నృత్యం చేస్తుంటే మరోవైపు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఐరోపా, చైనాల్లో తీవ్ర కరువు తాండవిస్తుంటే పాకిస్తాన్ లో మాత్రం వరదలు ముప్పతిప్పలు పెడుతున్నాయి. సగం వరకు పాక్ నీళ్లలోనే ఉందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. వీటికి ప్రధాన కారణం ప్రకృతి ప్రకోపమే అని తెలుస్తోంది.

పర్యావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నా వాటిని ఎవరు కూడా ఖాతరు చేయడం లేదు. విచ్చలవిడిగా అడవుల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం, ఓజోన్ పొర నాశనం వంటివి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కలుషితం కాకుండా చేయాలనే ఉద్దేశంతో పలు దేశాలు ముందుకు వచ్చినా దాన్ని ఆచరణలో చూపించడం లేదు. ఫలితంగా భూతాపం పెరిగిపోతోంది. మంచుకొండలు కరిగిపోతున్నాయి. భవిష్యత్ లో ఇంకా పెను ఉత్పాతాలు సంభవించనున్నాయని తెలుస్తోంది.
విపత్కర పరిస్థితులకు మనమే కారణం. విచ్చలవిడిగా వినియోగిస్తున్న వనరులతో నష్టం తీవ్రంగానే ఉంటోంది. కొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పరిస్థితిలో ఇంకా ఏం మార్పులు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో మరింత ఉపద్రవాలు ముంచుకొచ్చే ప్రమాదం నెలకొంది. ప్రకృతి వనరులను ఇష్టమొచ్చినట్లు నాశనం చేయడంతో ఈ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. చైనాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఐరోపాలోని కొన్ని దేశాల్లో నదులు కూడా ఇంకిపోయి కరువు తాండవిస్తోంది.

వాతావరణంలో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. యూకే, ఐరోపా దేశాలలో కరువు భయపెడుతోంది. చైనాలో యాంగ్జీ నది ఎండిపోవడంతో అక్కడ దుర్భిక్షం నెలకొంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించి చేరుకోవడం గమనార్హం. ప్రపంచంలో ఇంకా అనేక మార్పులు చోటుచేసుకునే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పులతో దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. వాతావరణంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఇంకా ఎన్ని ఉపద్రవాలు ముంచుకొస్తాయో కూడా తెలియడం లేదు.
https://www.youtube.com/watch?v=5THwJgxJGv0