
Naresh- Pavitra Marriage: గత కొంత కాలం నుండి మీడియా లో మారుమోగిపోతున్న పేరు పవిత్ర.సీనియర్ నటుడు నరేష్ తో ప్రేమాయణం నడిపి డేటింగ్ చేస్తూ వచ్చిన ఈమె, ఎన్నో వివాదాల నడుమ నేడు పెళ్లి ఆయనని పెళ్లి చేసుకుంది.చూసేందుకు ఇంత చక్కగా అనిపిస్తున్న ఈమె, 60 ఏళ్ళ వయస్సు ఉన్న నరేష్ ని ప్రేమించి పెళ్లాడడం ఏమిటి అని సోషల్ మీడియా లో అందరూ ఈమెపై పెదవి విరిచారు.
క్యారక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న పవిత్ర, వ్యక్తిగత జీవితం లో మాత్రం అలాంటి పేరు తెచుకోలేకపొయ్యారు.పద్దతి గా ఆమెపాటు ఆమె తన సినిమాలు చేసుకుంటూ ఉంది ఉంటే ఈరోజు ఆమెకి ఎంతో గౌరవం ఉండేది.ఇప్పుడు గౌరవం పోయింది, సినిమాల్లో అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి.ఇంతకీ ఈ పవిత్ర లోకేష్ ఎవరు, ఆమె బ్యాక్ గ్రౌండ్ వివరాలు ఏమిటి, ఎందుకు టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
పవిత్ర లోకేష్ కర్ణాటక ప్రాంతం లోని మైసూరు కి చెందిన అమ్మాయి.ఈమె తండ్రి లోకేష్ కన్నడ సినీ పరిశ్రమ లో పెద్ద నటుడు.అయితే తండ్రి పెద్ద నటుడైనప్పటికీ కూడా పవిత్ర లోకేష్ కి సినిమాల్లో నటించడం ఇష్టపడేది కాదు, ఆమె ఒక ప్రభుత్వ అధికారిగా స్థిరపడాలని కలలు కన్నాది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఎంతో కస్టపడి చదివింది కానీ, మొదటి ప్రయత్నం లో విఫలం అయ్యింది.ఇక ఆ తర్వాత తండ్రి చనిపోవడం తో , ఇక కుటుంబ బాధ్యతలు మొయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ ప్రోత్సాహం తో సినిమాల్లోకి అడుగుపెట్టింది.హీరోయిన్స్ తో సరిసమానమైన అందం ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఈమెకి ఎవ్వరూ హీరోయిన్ రోల్స్ ఆఫర్ చెయ్యలేదు.

క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ మరియు నెగటివ్ రోల్స్ లోనే ఎక్కువ కనిపించేది.ఇక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువగా అమ్మ పాత్రలే చేస్తూ వచ్చింది పవిత్ర.పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది,ఆలా కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయం లో నరేష్ తో ప్రేమాయణం నడిపి బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకుంది.ఇప్పుడు ఈమెకి అవకాశాలు ఇవ్వడానికే భయపడిపోతున్నారు దర్శక నిర్మాతలు.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023