
Naresh-Pavitra Marriage: ‘లేటు వయసులో ఘాటు ప్రేమ’ అన్నట్లుగా సీనియర్ నటుడు నరేశ్ 60 పడిలో తోడు కోసం పరితపించారు. ఇప్పటికీ తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఎవరూ తనతో కలిసి ఉండలేకపోయారు. చివరికి పవిత్రతో తాను ఘాటు ప్రేమలో పడ్డానని, తనతో జీవితం పంచుకుంటానని ప్రకటించి ఆమెను సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వయసులో పెళ్లేంటి? అని కొందరు ఎద్దేవా చేస్తున్నా చివరి మజిలీ కోసం తోడు ఉండాలని మరికొందరు నరేష్ కు సపోర్టు చేస్తున్నారు. అంతేకాకుండా తాను మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తున్నానని నరేష్ ఇదివరకే చెప్పారు. ఈ సమయంలో తనకు పవిత్ర పరిచయం అయినప్పటి నుంచి ఎంతో ఉల్లాసంగా ఉన్నానని, అందువల్ల తనతో జీవితాంతం కలిసి ఉండాలని చెప్పారు. ఇంతకీ నరేష్ ఎలాంటి మానసిక క్షోభను అనుభవించినట్లు? అసలు ఆయన 4వ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
కామెడీ చిత్రాల ద్వారా అలరించిన నరేష్ మొదట డ్యాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడియారు. వీరికి నవీన్ విజయ్ కృష్ణ అనే కుమారుడు ఉన్నారు. ఆ తరువాత నరేష్ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి మనువరాలైన సుప్రియను రెండో వివాహం చేసుకున్నారు. వీరికీ ఓ కుమారుడు ఉన్నారు. అతని పేరు తేజ. అయితే నరేష్, సుప్రియల మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. అయితే ఓ సంస్థ కోసం వీరు మళ్లీ కలిసున్నట్లు సమాచారం.
ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకొని విడిపోయిన తరువాత నరేష్ ఒంటరికగా ఉండలేకపోయారు. దీంతో పెద్దల సమక్షంలో ఏపీ కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి సోదరుడు కుమార్తె రమ్యను పెళ్లి చేసుకున్నారు. వీరికి కూడా ఓ బాబు పుట్టారు. అయితే ఆమెతో కూడా నరేష్ కలిసి ఉండలేకపోయారు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య గోడవలు తీవ్రస్థాయికి చేరడంతో తాను మానసికంగా కుంగిపోయానని నరేష్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో నరేష్ మళ్లీ ఒంటరివాడయ్యారు.

తాన జీవితంలో ఏ అమ్మాయి ఇక కలిసుండదని అనుకుంటున్న తరుణంలో పవిత్ర లోకేశ్ ఆయనకు చేరువైంది. తన కష్టాలను, భావాలను అర్థం చేసుకుంది. అయితే పవిత్ర లోకేశ్ కు సైతం అప్పటికే భర్త, పిల్లలు ఉన్నారు. అలాగే మరో నటుడితో సహజీవనం చేసి విడిపోయారు. ఈ తరుణంలో ఇద్దరు దారులు ఒకటే అని భావించి ఒక్క రూట్ లో వెళ్లాలనుకున్నారు. అయితే నరేశ్, పవిత్ర లోకేశ్ ల వివాహం ఇద్దరు భార్యలు వ్యతిరేకించకపోయినా మూడో భార్య రమ్య మాత్రం ఇటీవల తీవ్ర ఆందోళన చేసింది. కానీ తన వల్లే నా జీవితం నాశనమైంని నరేష్ అనుకుంటూ వస్తున్నారు.
తాజాగా నరేశ్ ఏకంగా పవిత్రను పెళ్లి చేసుకొని ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సందర్భంగా పెళ్లి తేదీని ప్రకటించలేదు. ఒకవేళ ముందుగా చెబితే గొడవలు జరిగే ఆస్కారం ఉందని భావించిన ఆయన సీక్రెట్ గా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు జీవితాంత తోడుండేందుకు వచ్చిన పవిత్ర లోకేశ్ ను తనకు కాకుండా ఎక్కడ అడ్డుకుంటారోనని ఆయన ఆమెను గప్ చుప్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే పవిత్ర లోకేశ్ తోనైనా నరేష్ జీవితాంతం కలిసుంటారా? లేదా? అని ఇండస్ట్రీలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023
