Homeక్రీడలుIndia Vs Australia 4th Test Day 2: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: ఖవాజా 150,...

India Vs Australia 4th Test Day 2: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: ఖవాజా 150, గ్రీన్ 100

India Vs Australia 4th Test Day 2
India Vs Australia 4th Test Day 2

India Vs Australia 4th Test Day 2: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలిసారి ఆస్ట్రేలియా 350 పరుగులు చేసింది.. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 150 కొట్టాడు.. మరో బ్యాట్స్మెన్ గ్రీన్ సెంచరీ సాధించాడు.. రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా కడపటి వార్తలు అందేసరికి 355 పరుగులు చేసింది.. మైదానంపై తేమ లేకపోవడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ధారాళంగా పరుగులు తీస్తున్నారు.

తొలి రోజు 4 వికెట్లు తీసిన భారత బౌలర్లు, రెండో రోజు కడపటి వార్తలు అందేసరికి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. రవీంద్ర జడేజా కు లైన్ దొరికినప్పటికీ.. వికెట్లు ఏమీ తీయలేకపోయాడు. మరోవైపు రోహిత్ శర్మ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగిస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది.. ఇక ఇప్పటికే గ్రీన్, ఖవాజా జోడి ఇప్పటి వరకూ ఐదో వికెట్ కు 185 పరుగులు జోడించింది.

India Vs Australia 4th Test Day 2
India Vs Australia 4th Test Day 2

తొలి రోజు బౌలర్లకు కొద్దో గొప్ప సహకరించిన అహ్మదాబాద్ మైదానం.. రెండవ రోజు పూర్తిగా నిర్జీవంగా మారిపోయింది.. బంతి ఏమాత్రం మెలికలు తిరగడం లేదు.. సీమర్లకు కూడా అనుకూలించడం లేదు. దీంతో గ్రీన్, ఖవాజా జోడిని విడదీసేందుకు భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు.

 

ఇంతకీ ఫాక్స్ కాన్ పెట్టుబడి ఎక్కడ? తెలంగాణలోనా, కర్ణాటకలోనా? || Foxconn || Telangana || Karnataka

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version