
Nagarjuna On Agent: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే కెరీర్ ప్రారంభం నుండి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చెయ్యలేదు. ఫ్యాన్స్ ఒక స్టార్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా పడితే కెరీర్ స్థిరపడుతుంది అనే ఎదురు చూస్తూ ఉన్న సమయం లో ‘ఏజెంట్’ మూవీ ని ప్రకటించారు.
రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే అఖిల్ ఈ సినిమాలో రోమాలు నిక్కపొడిచే యాక్షన్ సన్నివేశాలు చేసాడని అర్థం అవుతుంది. అంతే కాదు హీరో క్యారెక్టర్ ని కూడా చాల స్పెషల్ గా డిజైన్ చేసాడు సురేందర్ రెడ్డి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ని నేడు వరంగల్ లో నిర్వహించారు.

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అక్కినేని నాగార్జున హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాని నిజంగా నేను ఇప్పటి వరకు చూడలేదు, కానీ అఖిల్ షూటింగ్ నుండి ఇంటికి వచ్చినప్పుడు నాకు ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చెప్తూ ఉండేవాడు. అవి విన్న తర్వాత నా కొడుకు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు అని అర్థం అయ్యింది. ఈ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకం ఇంకా గట్టిగా కలగడానికి కారణం సూపర్ స్టార్ మమ్ముటి ఈ చిత్రాన్ని ఒప్పుకొని చెయ్యడమే. ఆయన ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు అంటే మామూలు విషయం కాదు.ఇక అఖిల్ ఎనర్జీ ని మీరు ఇప్పుడు చూస్తున్నారు, మేము చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాము. వాడికి ఏడాది 8 నెలలు నిండినప్పుడే ఊరికే అటు ఇటు తిరుగుతూనే ఉండేవాడు. అంత చిన్న వయస్సులో అంత ఎనర్జీ ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ ఏజెంట్ సినిమాలో కూడా సురేందర్ రెడ్డి మా అఖిల్ ని అంతే ఎనర్జీ తో చూపించాడు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.