spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu- Nagababu: వె.ధ.వ సోది.. నీ పని నువ్వు చెయ్.. అంబటికి క్లాస్ పీకిన...

Ambati Rambabu- Nagababu: వె.ధ.వ సోది.. నీ పని నువ్వు చెయ్.. అంబటికి క్లాస్ పీకిన నాగబాబు

Ambati Rambabu- Nagababu: పవన్ ఏది చేసినా.. ఎక్కడికి వెళ్లినా వైసీపీలో కలవరపాటే. చివరకు బాలక్రిష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు పవన్ వెళ్తున్నారన్న నాటి నుంచి వైసీపీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా లాంటి వాళ్లు పనిగట్టుకొని మాట్లాడుతున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షో రెండో సీజన్లో అడుగు పెట్టింది. చంద్రబాబు, లోకేష్ లతో రెండో సీజన్ ప్రారంభంకాగా.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిల ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. అటు తరువాత ఎంతో మంది సినీ ప్రముఖుల ఎపిసోడ్లు వచ్చాయి. అయితే పవన్ షో లో అడుగుపెట్టనున్నాడని తెలిసిన నాటి నుంచే సినీ, రాజకీయ వర్గాల్లో ఒక రకమైన ఆసక్తి కనిపించింది. అటు బాలక్రిష్ణ, ఇటు పవన్ అభిమానుల్లో కూడా షో విపరీతమైన హీట్ పెంచేసింది. అయితే ఈ షో ద్వారా బాలయ్య, పవన్ లు కలవడంపై మాత్రం వైసీపీ కలవరపాటుకు గురవుతోంది.

Ambati Rambabu- Nagababu
Ambati Rambabu- Nagababu

మంత్రులు అంబటి రాంబాబు, రోజా, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అన్నయ్య షోకు డుమ్మా.. బాలయ్య షోకి జమ్మ..రక్తసంబంధం కంటే ప్యాకేజీ సంబంధమే గొప్పదా?’ అంటూ మంత్రి అంబటి ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ కు సంబంధించి పెద్ద రచ్చే నడుస్తోంది. జన సైనికులు, అభిమానులు, మెగా ఫ్యాన్స్ గట్టిగానే రిప్లయ్ ఇస్తున్నారు. నువ్వు నీటి పారుదల శాఖ మంత్రివి. ముందు పోలవరంపై ఫోకస్ చెయ్ అని కౌంటర్ ఇస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు సైతం స్పందించారు. బాలక్రిష్ణ సినిమా డైలాగు తరహాలో అంబటికి గట్టిగానే హెచ్చించారు. ‘ముందెళ్లి పోలవరం సంగతి చూడవోయ్.. వె.ధ.వ సోది‘ అంటూ ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు.

అయితే ఇన్నాళ్లూ లేనిది బాలక్రిష్ణ అన్ స్టాపబుల్ షోపై వైసీపీ అతిగా స్పందించడానికి చాలా కారణాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుందన్న వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే రెండు పార్టీల మధ్య మంచి వాతావరణం నడుస్తోంది. అయితే దీనినే ఊహిస్తూ వస్తున్న అధికార వైసీపీ మాత్రం ఆ వాతావరణాన్ని చెడగొట్టేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ వర్కవుట్ కావడం లేదు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన అసహనం నెలకొంది. ఆ రెండు పార్టీల కలయిక తమకు ముప్పు తెస్తుందని బలంగా నమ్ముతున్నారు. వారితో పాటు బీజేపీ కూడా కలిసే వెళుతుందని ఎక్కువ మంది వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్ స్టాపబుల్ షోకి అటెండ్ అవుతుండడం.. పొలిటికల్ గా కొన్ని అంశాలపై పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. షోకి విపరీతమైన వ్యూయర్ షిప్ ఉండడంతో అవి ప్రజల్లోకి బలంగా వెళతాయని వైసీపీ భావిస్తోంది. అందుకే ముందగా షోపై ఒక రకమైన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడంలో భాగమే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Ambati Rambabu- Nagababu
Ambati Rambabu- Nagababu

ఇప్పటికే నాగబాబు బుల్లితెరపై ఎన్నో షోలు చేశారు. వాటికెప్పుడు పవన్ వెళ్లలేదు. వాటిని అన్ స్టాపబుల్ షోతో ముడిపెడుతూ వైసీపీ నేతలు టార్గెట్ చేయడం ప్రారంభించారు. పాత చింతకాయ మాదిరిగా ప్యాకేజీ అన్న పదాన్ని జత కలిపి తమ పాత రాజకీయాలను మొదలుపెట్టారు. అందుకే మెగా బ్రదర్ నాగబాబు ఎంటరయ్యారు. క్లారిటీగా అంబటికి క్లాస్ పీకినంత పనిచేశారు. వె.ధ.వ అని సంభోదిస్తూ.. ముందు నీ పని నువ్వు చెయ్యవోయ్ అని గట్టిగానే చెప్పారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version