Naga Chaitanya Custody: ‘కస్టడీ’తో ఆకట్టుకుంటున్న నాగచైతన్య..

Naga Chaitanya Custody: ఫ్యామిలీ డిస్డ్రబెన్ తరువాత నాగచైతన్య వేరే ఆలోచనలు పెట్టుకోకుండా సీరియస్ గా సినిమాలు తీస్తున్నాడు. అయితే కొన్ని అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా..మరికొన్ని పర్వాలేదనిపించాయి.. ఇటీవల ఆయన ‘లాల్ సింగ్ చడ్డా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా నాగచైతన్యపై పలువురి డైరెక్టర్ల దృష్టి పడింది. దీంతో ఆయనతో మంచి సినిమా తీయాలని చాలా మంది రెడీగా ఉన్నారు. అందరికంటే ముందుగా వెంకట్ ప్రభు అలర్డ్ అయ్యాడు. తాజాగా చైతూతో కలిసి […]

Written By: SHAIK SADIQ, Updated On : November 23, 2022 1:25 pm
Follow us on

Naga Chaitanya Custody: ఫ్యామిలీ డిస్డ్రబెన్ తరువాత నాగచైతన్య వేరే ఆలోచనలు పెట్టుకోకుండా సీరియస్ గా సినిమాలు తీస్తున్నాడు. అయితే కొన్ని అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా..మరికొన్ని పర్వాలేదనిపించాయి.. ఇటీవల ఆయన ‘లాల్ సింగ్ చడ్డా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా నాగచైతన్యపై పలువురి డైరెక్టర్ల దృష్టి పడింది. దీంతో ఆయనతో మంచి సినిమా తీయాలని చాలా మంది రెడీగా ఉన్నారు. అందరికంటే ముందుగా వెంకట్ ప్రభు అలర్డ్ అయ్యాడు. తాజాగా చైతూతో కలిసి ఈయన ‘కస్టడీ’ అనే సినిమాను తీస్తున్నాడు. చిట్టూరి శ్రీను నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన ఓ లుక్ కు ఇటీవల రిలీజ్ అవుతోంది. చైతూ మిగతా సినిమాల్లో కంటే ఇందులో భారీ యాక్షన్ చేసినట్లు అర్థమవుతోంది.

Naga Chaitanya Custody

‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ‘ఏమాయ చేశావే’తో పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే ఆ తరువాత ‘తడాఖా’ సినిమాతో చైతూ యాక్షన్ హీరో అనిపించుకున్నాడు. కానీ ఈ యంగ్ హీరోతో యాక్షన్ మూవీకి ఎవరూ ధైర్యం చేయలేదు. కొన్ని డిఫరెంట్ కథలు అందించినా కలిసి రాలేదు. ఇదే క్రమంలో ఆయన సమంతతో విడాకుల వ్యవహారంతో కాస్త మనస్థాపంతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎలాంటి వ్యాపకాలు పెట్టుకోకుండా యాక్టింగ్ పై నే ఫోకస్ పెట్టాడు. సినిమాలు ఎలా ఉన్నా చైతూ యాక్టింగ్ పై పలువురి దృష్టి పడింది. ఈ తరుణంలో ఆయనతో ‘కస్టడీ’ తీయాలని వెంకట్ ప్రభు నిర్ణయించుకున్నాడు.

‘కస్టడి’ లుక్ చూస్తుంటే భారీ బడ్జెట్ మూవీ అని తెలుస్తోంది. ఈ యంగ్ హీరోతో ప్రయోగం చేయడానికి చిట్టూరి శ్రీను ముందుకొచ్చాడు. ‘యూటర్న్’, ‘ వారియర్’,తదితర సినిమాలతో మంచి పేరు తెచ్చకున్న ఈయన ఇప్పుడు నాగచైతన్యతో ‘కస్టడీ’ చేస్తున్నాడు. ఆకట్టుకునే టైటిల్ తో పాటు సినిమా సబ్జెక్ట్ కూడా బాగానే ఉంటుందని చిత్రం యూనిట్ అవుతోంది. అంతేకాకుండా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా స్పీడ్ గా షెడ్యూల్ స్పీడందుకోనుంది. తెలుగు, తమిళంలో ఒకేసారి దీనిని రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

Naga Chaitanya Custody

ఈ సినిమాకు యువన్ శంకర్ మ్యూజిక్ అందించనున్నారు. చాలా రోజుల తరువాత ఈయన చైతూ సినిమాకు బాణీలు అందించడం విశేషం. అటు చైతూ కూడా ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఈ ఒక్క మూవీ హిట్టయితే మరోసారి ఫాంలోకి వచ్చినట్లవుతుందని నాగచైతన్య భావిస్తున్నాడు. ఇక చైతూ పిక్స్ తో ఫ్యాన్స సందడి చేస్తున్నారు. ఎన్నాళ్లో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చినట్లవుతుందని అంటున్నారు.

Tags