Naga Chaitanya: వరుస విజయాలతో జోరుమీదున్న నాగ చైతన్యకు థాంక్యూ భారీ షాక్ ఇచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ అని నమ్మి ఆఫర్ ఇస్తే విక్రమ్ కుమార్ డిజాస్టర్ ఇచ్చాడు. కొత్తదనం లేని కథ పసలేని స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఈ మధ్య కాలంలో నాగ చైతన్య నుండి ఇంత చెత్త మూవీ రాలేదు. బంగార్రాజు వరకు చైతూ సక్సెస్ ట్రాక్ మైంటైన్ చేస్తూ వచ్చారు. మజిలీ,వెంకీ మామ, లవ్ స్టోరీ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. థాంక్యూ ఫలితం నేపథ్యంలో స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలో దర్శకుడు పరుశురాం కి ఝలక్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

సర్కారు వారి పాట మూవీతో మహేష్ కి డీసెంట్ హిట్ ఇచ్చిన పరుశురాం నాగ చైతన్య మూవీని లాక్ చేశారు. గీత గోవిందం వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కించిన పరుశురాం పై చైతూ నమ్మకం ఉంచారు. తన ఇమేజ్ కి సరిపోయేలా మంచి స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నారు. నాగేశ్వరరావు టైటిల్ తో ఓ స్టోరీ లైన్ నాగ చైతన్యకు పరుశురామ్ వినిపించారట. పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేయండి మూవీ చేద్దామని చైతూ హామీ ఇచ్చారట. అయితే ఫైనల్ స్క్రిప్ట్ పట్ల చైతూ అసంతృప్తి వ్యక్తం చేశారట. బెటర్ వెర్షన్ కావాలని అడిగారట.
చేసేది లేక నాగ చైతన్య సూచించిన మార్పులతో స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో నాగ చైతన్య ఉన్నారట. అయినప్పటికీ పరుశురామ్ కథను చైతూ ఓకే చేసే ఛాన్స్ లేదని, టోటల్ గా పరశురాం ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న ప్రచారం మొదలైంది. మరి ఇదే నిజమైతే పరశురాం కి భారీ గ్యాప్ రానుంది. పరిశ్రమలో ఉన్న టాప్ హీరోల నుండి టైర్ టూ హీరోల వరకు అందరూ బిజీగా ఉన్నారు. నాగ చైతన్య మాత్రమే కొంచెం ఫ్రీగా ఉన్నారు. కస్టడీ మూవీ షూట్ చివరి దశకు చేరింది. వెబ్ సిరీస్ దూత షూట్ కంప్లీట్ అయినట్లు సమాచారం.

నాగ చైతన్యతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే పరశురాం కి నష్టమే అని చెప్పాలి. దర్శకులకు టాలీవుడ్ హీరోలు అసలు దొరకడం లేదు. ఇతర పరిశ్రమల దర్శకులతో చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మన దర్శకులేమో పర భాషా హీరోలతో సినిమాలు చేసుకోవాల్సి వస్తుంది. మహర్షి అనంతరం ఏళ్ల తరబడి మహేష్ కోసం ఎదురు చూసి బుక్కైన వంశీ పైడిపల్లి కోలీవుడ్ స్టార్ విజయ్ తో సేమ్ స్క్రిప్ట్ వారసుడు గా తెరకెక్కించారు. చూస్తుంటే పరుశురాం కూడా ఇతర పరిశ్రమల్లో హీరోల కోసం వెతుక్కోవాల్సి వస్తుందనిపిస్తుంది.