Naga Chaitanya Another Brother: నాగచైత్యకు మనకు తెలియని మరో తమ్ముడు ఉన్నాడు. అతడి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే అతడు నాగార్జున కొడుకు కాదు. చైతూ తల్లి గారైన లక్ష్మీ కుమారుడు. సినిమాల్లోకి రాకముందే నాగార్జునకి వివాహం జరిగింది. విదేశాలలో చదువు పూర్తి చేసుకొచ్చిన నాగార్జునకు దగ్గుబాటి రామానాయుడు తన కూతురు లక్ష్మిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నారు. ఇరు కుటుంబాలు ఈ సంబంధం పట్ల ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో 1984లో నాగార్జున-లక్ష్మీ వివాహం ఘనంగా జరిగింది. కొన్నేళ్లు వీరి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. అనంతరం మనస్పర్థలు రావడంతో 1990లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

అనంతరం లక్ష్మీ చెన్నైకి చెందిన వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నారు. మరోవైపు నాగార్జున హీరోయిన్ అమల ప్రేమలో పడ్డారు. 1992లో అమలను నాగార్జున పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరికి అఖిల్ సంతానం. లక్ష్మీకి రెండో భర్తతో ఒక అబ్బాయి పుట్టాడు. నాగ చైతన్య, అతడు కలిసే పెరిగారు. పెద్దవాడు అయ్యేవరకు నాగ చైతన్య అమ్మ, మేనమామలు వెంకటేష్, సురేష్ బాబుల వద్ద గడిపారు.
నాగచైతన్య తమ్ముడైన అఖిల్ గురించి అందరికీ తెలుసు. పసిప్రాయంలోనే అఖిల్ సిసింద్రీ పేరుతో మూవీ చేశారు. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలు చేస్తున్నారు. నాగ చైతన్య తల్లి తరపు తమ్ముడు గురించి మాత్రం ఎవరికీ తెలియదు. లక్ష్మీ రెండో కుమారుడైన అతడు తండ్రి మాదిరి బిజినెస్ మెన్ అయ్యారట. అతడు వ్యాపార రంగంలో రాణిస్తున్నారట. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారికే గుర్తింపు ఉంటుంది కాబట్టి, నాగ చైతన్య మరో తమ్ముడు పెద్దగా ఫోకస్ కాలేదు.

తల్లి వద్దే పెరిగి పెద్దవాడైనప్పటికీ నాగ చైతన్యను తన వారసుడిగా నాగార్జున భారీగా లాంచ్ చేశారు. జోష్ మూవీతో చైతూ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. నెక్స్ట్ మూవీ ఏమాయ చేశావేతో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీ హీరోయిన్ సమంతతో నిజంగా ప్రేమలో పడ్డారు. ఏళ్ల తరబడి ప్రేమ ప్రయాణం సాగింది. 2018లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత మనస్పర్ధలతో 2021లో విడిపోయారు. తండ్రి సెంటిమెంట్ చైతూని కూడా వెంటాడింది.