Jalsa Special Shows: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘జల్సా’ మూవీ స్పెషల్ షోస్ ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 1 మరియు రెండవ తారీఖులలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా అభిమానులు ఏర్పాటు చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..దాదాపుగా మూడు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం స్పెషల్ షోస్ లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది..అమెరికా నుండి అనకాపల్లి వరుకు రికార్డులే రికార్డులు.

కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలలో కూడా ఈ మూవీ స్పెషల్ షోస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..అయితే ఈ కలెక్షన్స్ మొత్తం జనసేన పార్టీ కి డొనేషన్ రూపం లో వెళ్తుంది అని ముందుగానే ప్రకటించారు..అయినా కూడా అభిమానులు స్వచ్చందంగా ఈ స్పెషల్ షోస్ ని ఏర్పాటు చెయ్యడానికి ముందుకు వచ్చారు..ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..థియేటర్ రెంట్స్ మరియు టాక్సులు పోను ఈ చిత్రానికి కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ స్పెషల్ షో ద్వారా వచ్చిన ఆ కోటి రూపాయిల షేర్ ని ఈరోజు హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో పవన్ కళ్యాణ్ ని కలిసి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ కి చెక్ అందచేశారు..ఈ సందర్భంగా జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి అభిమానులకు కృతఙ్ఞతలు తెలియచేసారు..ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగే స్థాయి నుండి డొనేషన్ చేసే స్థాయికి అభిమానులు ఎదిగినందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ‘నా సేన కోసం నా వంతు’ ప్రోగ్రాం ని గ్రాండ్ సక్సెస్ చేసిన ఫాన్స్ అందరికి కృతఙ్ఞతలు..జల్సా సినిమా స్పెషల్ షోస్ కి మీరు కొన్న టిక్కెట్లు వందమంది రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి మన అందరికి..విరామం సమయం ఆయనని కలిసి ఈ చెక్ అందచేశారు.