Krishna- Akkineni Family: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ..ఎన్టీఆర్ మరియు అక్కినేని నాగేశ్వరరావు సినిమాలను మాత్రమే చూసే జనాలకు టాలీవుడ్ కి సరికొత్త జానర్స్ మరియు టెక్నాలజీ ని పరిచయం చేసి ఇండస్ట్రీ స్థాయిని పెంచిన మహానుభావుడు ఆయన..అలాంటి చరిత్రగల సూపర్ స్టార్ కృష్ణ మొన్న ఉదయం తెల్లవారు జామున స్వర్గస్తులవ్వడం యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది.

తెలుగు తెరకి మొట్టమొదటి మాస్ హీరో గా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ కోట్లాది మంది అభిమానులను శోకసంద్రం లోకి నెట్టి తిరిగిరాని లోకాలకు ప్రయాణం అయ్యాడు..అయితే ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ కృష్ణ గారు అవకాశాల కోసం కెరీర్ ప్రారంభం లో మిగిలిన హీరోలలాగా పెద్ద కష్టాలేమి పడలేదు..అక్కినేని నాగేశ్వర రావు గారు తమ ఊరుకి వచ్చినప్పుడు ఆయన క్రేజ్ మరియు ఫాలోయింగ్ ని చూసి షాక్ కి గురైయ్యానని..అప్పటి నుండే సినిమా హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యానని కృష్ణ గారు పలు ఇంటర్వ్యూ లో తెలిపాడు.
అలా చెన్నై కి ప్రయాణమైనా కృష్ణ గారికి సినిమా అవకాశాలు సులువుగానే దక్కాయి..కానీ హీరో అవ్వడానికి మాత్రం కాస్త సమయం పట్టింది..తొలుత చిన్న చిన్న పాత్రలతోనే కృష్ణ గారు తన కెరీర్ ని ప్రారంభించారు..అయితే తేన మనసులు చిత్రం షూటింగ్ కోసం అప్పట్లో హీరో పాత్ర కోసం కొత్త వారిని ఆడిషన్స్ చేస్తున్నారు..ఆ ఆడిషన్స్ కి కృష్ణ గారు కూడా హాజరయ్యారు.

అయితే ఈ చిత్రం ఆడిషన్స్ కమిటీ లో ఒక మెంబెర్ గా ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారు ‘ఈ కుర్రాడు ఎవరో చాలా అందంగా ఉన్నాడు..మన సినిమాకి ఇతను అయితేనే సరిగ్గా సరిపోతాడు..ఇతనిని సెలెక్ట్ చేసేయండి’ అంటూ చెప్పాడట..నాగేశ్వర రావు గారు ఇచ్చిన సలహా మేరకే కృష్ణ గారిని ఆ చిత్రం లో హీరో గా తీసుకున్నారు..అలా ప్రారంభమైన కృష్ణ గారు ఈరోజు ఒక చరిత్ర అయ్యారు..నాగేశ్వర రావు గారు లేకపోతే నాకు సినీ కెరీర్ లేదని కృష్ణ గారు అనేక సందర్భాలలో తెలిపాడు కూడా.