https://oktelugu.com/

అక్కడ ఎన్ 95 మాస్కులు నిషేధం.. కారణం ఏంటంటే?

దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మాస్క్ ధరిస్తే మాత్రమే వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకునే పరిస్థితి నెలకొంది. ప్రజలు మాస్క్ లకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో మార్కెట్లో రకరకాల మాస్క్ లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు, నిపుణులు అన్ని రకాల మాస్క్ లు కరోనా సోకకుండా ఆపలేవని చెబుతున్నారు. ముఖ్యంగా వాల్వ్ ఉన్న మాస్క్ ల వల్ల అవతలి వ్యక్తులకు కరోనా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 15, 2020 / 07:57 AM IST
    Follow us on

    దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మాస్క్ ధరిస్తే మాత్రమే వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకునే పరిస్థితి నెలకొంది. ప్రజలు మాస్క్ లకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో మార్కెట్లో రకరకాల మాస్క్ లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు, నిపుణులు అన్ని రకాల మాస్క్ లు కరోనా సోకకుండా ఆపలేవని చెబుతున్నారు.

    ముఖ్యంగా వాల్వ్ ఉన్న మాస్క్ ల వల్ల అవతలి వ్యక్తులకు కరోనా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రజల ఆలోచనా తీరు మాత్రం మారడం లేదు. కొందరు అవే మాస్కులను నేటికీ వినియోగిస్తున్నారు. దీంతో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మధ్యప్రదేశ్ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వాల్వ్ ఉన్న ఎన్ 95 మాస్క్ లతో పాటు వాల్వ్ ఉన్న ఇతర మాస్క్ లపై కూడా నిషేధం విధించింది.

    వాల్వ్ లు ఉన్నవ్ మాస్కుల వల్ల కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యం కావడం లేదని భావించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో వాల్వ్ ఉన్న మాస్కులపై నిషేధం విధిస్తూ ఇండోర్ కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కేంద్రం గతంలోనే వాల్వ్ లు ఉన్న మాస్కులు ప్రమాదకరం అని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.