Chiranjeevi- Balakrishna Multistarrer: అన్ స్టాపబుల్ షో వేదికగా బాలకృష్ణ-చిరంజీవి మల్టీస్టారర్ చర్చకు వచ్చింది. నిర్మాత అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ చేద్దామని వెయిటింగ్ అంటూ కొన్ని ఊహాగానాలకు తెరలేపారు. అయితే చిరంజీవితో తాను మల్టీస్టారర్ చేస్తే అది ఎలా ఉండాలో బాలకృష్ణ చెప్పడం విశేషత సంతరించుకుంది. అన్ స్టాపబుల్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు గెస్ట్స్ గా వచ్చారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మధ్యలో జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ అల్లు అరవింద్ ని ఒక ప్రశ్న అడిగారు. ఇన్నేళ్ళలో నిర్మాతగా నాతో మూవీ ఎందుకు చేయలేదన్నారు. దానికి అల్లు అరవింద్ దగ్గర ఆన్సర్ లేదు. కుదర్లేదు అని రెగ్యులర్ ఆన్సర్ చెప్పకుండా బాగా వైరల్ అయ్యే కామెంట్ చేశారు. ఏమీ లేదు చిరంజీవి, మీతో ఒక మల్టీస్టారర్ చేద్దామనే ఆలోచన ఉంది. అందుకే మీతో చేయలేదు అన్నారు. ఆయన సమాధానానికి బాలయ్య కొంచెం స్ట్రేంజ్ గా ఫీల్ అయ్యాడు.
నేను రెడీ అంటూ… స్క్రిప్ట్ ఎలా ఉండాలో సూచనలు చేశారు. సినిమాలో సాంగ్స్ మొత్తం చిరంజీవికి, ఫైట్స్ మొత్తం నాకు. ఇంట్రో సాంగ్ ఆయనకు పడాలి. ఇక క్లైమాక్స్ ఫైట్ నాది కావాలి, అన్నారు. బాలయ్య ఇంకా మాట్లాడుతూ… క్లైమాక్స్ ఫైట్ నాదైతే ప్రేక్షకులు నన్నే గుర్తు పెట్టుకుంటారు అన్నాడు. సాంగ్స్ చిరంజీవికి ఫైట్స్ నాకు అని చెప్పిన బాలయ్య కామెంట్ లో న్యాయం ఉంది. చిరంజీవి గొప్ప డాన్సర్ అని ఒప్పుకున్నాడు. ఒకటి ఆయనకు ఇచ్చాడు కాబట్టి మరొకటి ఆయన కోరుకోవడంలో తప్పు లేదు.

క్లైమాక్స్ ఫైట్ నాదైతే ప్రేక్షకులకు నేను గుర్తుండిపోతాను అనడంలో స్వార్థం కనిపిస్తుంది. బాలయ్య సంగతి అందరికీ తెలిసిందే కింద పడ్డా పైన పడ్డా నాదే పై చేయి అంటాడు. మాట్లాడితే స్థాయి అంటాడు… నాన్న పేరు చెప్పి మాదో చరిత్ర అంటాడు. ఇక్కడ కూడా నేను ఎక్కువ అనే ఆ భావన బాలయ్య కామెంట్స్ లో కనిపించింది. ఇక నిజంగా అల్లు అరవింద్ నిర్మాతగా చిరంజీవి-బాలకృష్ణ మల్టీస్టారర్ సెట్ అయితే కే రాఘవేంద్రరావు దర్శకుడట. అప్పుడు ఇది పాన్ వరల్డ్ మూవీ అవుతుందంటూ బాలకృష్ణ గొప్పగా చెప్పారు.
అన్ స్టాపబుల్ వేదికగా బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఎప్పుడో కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ చిత్రాల్లో చేశారు. స్టార్ గా ఎదిగాక చిరంజీవి మల్టీస్టారర్స్ చేయలేదు. ఇక బాలయ్యతో మల్టీస్టారర్ అనే ఆలోచన అసలు లేదు. దశాబ్దాలుగా మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మధ్య వైరం ఉన్న కారణంగా ఆ దిశగా అడుగులు పడలేదు. అయితే ఎన్టీఆర్-చరణ్ కలిసి నటించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు.