HIT2 Movie : హిట్2 హిట్ అయిపోయింది. ప్రేక్షకులు ఈ క్రైం సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఈ వీకెండ్ లో మరింతగా కలెక్షన్లు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. హిట్2 మూవీలో అమ్మాయి తల, మెడ, కాళ్లు, చేతులు అన్నీ నరికేసే ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ కథ నడుస్తుంది. అత్యంత దారుణంగా అమ్మాయిలను చంపే వాడిని పట్టుకోవడానికి మన పోలీస్ ఆఫీసర్ అడివిశేష్ ప్రయత్నాలు చేస్తుంటాడు.

అయితే మహేష్ అనే సీరియల్ కిల్లర్ దారుణాలను థియేటర్ లో చూసిన ఓ లేడీ ఫ్యాన్ తట్టుకోలేకపోయారు. ఆ సినిమా చూశాక ఆ లేడి ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. హిట్ 2 సినిమాలో అమ్మాయిలను అలా కిల్లర్ చంపడాన్ని జీర్ణించుకోలేకపోయింది. థియేటర్ లో సినిమా చూసి బయటకు వచ్చాక ఏకంగా ఈ సినిమా నిర్మాత నానికి, హిట్ 2లో హీరోగా చేసిన అడవి శేష్ ను హెచ్చరించింది.
‘హిట్-2లో అమ్మాయిలను చంపారని.. హిట్-3లో మాత్రం అబ్బాయిలు చచ్చిపోవాలని.. అమ్మాయిని సీరియల్ కిల్లర్ గా పెట్టాలని ’ ఆ యువతి డిమాండ్ చేసింది. నాని గారు హిట్ 3 తీసేది మీరే కాబట్టి.. మహిళలను కిల్లర్ గా పెట్టండి.. మీకు చేతగాకపోతే చెప్పండి.. నేను చేసి చూపిస్తా.. లేదంటే నేను ఆ విలన్ ను మర్డర్ చేసి లేడీ సీరియల్ కిల్లర్ ఎలా ఉండాలో చూపిస్తాను’ అంటూ ఆ యువతి వీరావేశాలకు పోయింది.

హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ ముందు జరిగిన ఈ యువతి కోపాన్ని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేసి అడవి శేష్ కు ట్యాగ్ చేశారు. దీన్ని చూసి అడవి శేష్ ఫన్నీగా కామెంట్ చేశారు. ‘చంపినా చంపస్తుంది.. కానీ థియేటర్ లో’ అంటూ ఫన్నీ ఎమోజీలు పెట్టాడు.
ఈ సినిమా ప్రేక్షకులపై ఎంతగా ప్రభావం చూపిస్తుందంటే విలన్ ను చంపేసేంత కోపం ప్రేక్షకుల్లో కలుగుతోంది. అంటే మూవీ హిట్ అయినట్టే. అందుకే అడవి శేష్, హీరో నానిలు సంబరాలు చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ అభిప్రాయాలను షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
https://twitter.com/Praveenmudhir1/status/1598876288282136577?s=20&t=3geid1hTR1egUGZX9EFPdA