Viral News: ఆకలి రుచెరగదు. నిద్ర చోటెరగదు. పూటకూళ్లమ్మ పుణ్యమెరగదు అనేది సామెత. బాగా ఆకలి వేసినప్పుడు కారం మెతుకులైనా పరమాన్నంగా భావిస్తాం. అతిగా నిద్ర వస్తే అది కటిక నేలైనా పూలపరుపుగా అనుకుంటాం. అదే పూటకూళ్లమ్మ దగ్గరకు వెళ్లి పుణ్యం కోసం దానం చేయమంటే చేస్తుందా? చేయదు. తాను వండిన వాటిని ధర కట్టి అమ్ముకుంటుంది. ఆకలితో ఉన్నవాడికి తెలుసు దాని బాధ ఏంటనేది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ ఎంబీఏ విద్యార్థి ఆకలి వేయడంతో పెళ్లి భోజనం తిన్నాడు. దీంతో వారి బంధువులకు దొరికాడు. దీంతో వారు అతడితో ప్లేట్లు కడిగించి అవమానించారు. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. ఏదో ఆకలి వేసి అన్నం తింటే నేరమా? అనే కామెంట్లు వచ్చాయి. పెళ్లివారి నిర్వాకాన్ని అందరు విమర్శించారు.

అచ్చంగా ఇలాంటి సంఘటనే మరోటి జరిగింది. కానీ ఇక్కడ పెళ్లివారు ఎంతో పెద్ద మనసు ప్రదర్శించారు. హాస్టల్ లో ఉండే విద్యార్థికి అక్కడ వంట చేయకపోవడంతో బాగా ఆకలి వేసింది. దీంతో ఓ పెళ్లి వేడుక కనిపించింది. వెంటనే అతడు ఆ ఫంక్షన్ లో భోజనం చేసిన స్టూడెంట్ పెళ్లి కొడుకుతో సెల్ఫీ తీయించుకుని తన నిజాయితీ చాటాడు. నేను నీకు పరిచయస్తుడిని కాదు. బాగా ఆకలేస్తే వచ్చి బోజనం చేశానని తన విషయం బయటపెట్టాడు. దీంతో వరుడు కూడా మంచిగా స్పందించాడు. చాలా సంతోషం ఇంకా మీ హాస్టల్ కు అవసరమైతే ప్యాక్ చేసుకుని తీసుకెళ్లండని సలహా ఇచ్చాడు. దీంతో పెళ్లి కొడుకు మంచితనానికి అందరు ఫిదా అయిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది.
ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్ లో ఈ వీడియో షేర్చేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే క్యాప్షన్ పెట్టి పోస్టు చేయడంతో వీడియోను 1.3 లక్షల మంది వీక్షించారు. పది వేలకు పైగా లైకులు వచ్చాయి. ఉచితంగా భోజనం చేసినా ఇబ్బంది లేదని తన పెద్ద మనసు చాటుకున్నాడు. నేను కూడా హాస్టల్ లో ఉన్నప్పుడు ఇలాగే చేశానని తన మనసులోని మాట బయట పెట్టాడు. మొత్తానికి వరుడు చేసిన పని అందరికి ఎంతో నచ్చింది. అతడి మాటలు అందరికి ఆదర్శ ప్రాయంగా నిలిచాయనడంలో సందేహం లేదు.

ప్రస్తుత కాలంలో ఫంక్షన్ హాళ్ల ముందర బంధువులు కాపలా ఉంటున్నారు. బయటి వారిని లోనికి రానీయకుండా చూస్తున్నారు. పట్టెడంత అన్నం కోసం అంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే ఎంతో పుణ్యమని మన పురాణాలు చెబుతున్నా అంతటి గొప్ప గుణం ఎవరికి ఉంటుంది. ఇక్కడ పెళ్లి కొడుకు చేసిన పనికి అందరు అతడికి ఫ్యాన్ అయ్యారు. భోజనం కోసం అల్లాడాల్సిన అవసరం లేదని ఒక పూట తింటే నష్టమేమీ ఉండదని చెప్పడం కొసమెరుపు.
This is my India 🥹 🇮🇳
— maithun (@Being_Humor) December 1, 2022