Anant Ambani Pre Wedding: అనంత్ కోసం రాధిక పాట.. ముఖేష్ అంబానీ భావోద్వేగం.. వీడియో వైరల్

ముందస్తు పెళ్లి వేడుకల్లో చివరి రోజైన మార్చి మూడున ముఖేష్ కుటుంబం హస్తాక్ష అనే పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో కభీ ఖుషి కభీ ఘమ్ అనే సినిమాలో ఓ పాటను పాడుతూ రాధిక అనంత్ అంబానీని ఉత్సాహపరిచారు.

Written By: Suresh, Updated On : March 7, 2024 10:35 am

Anant Ambani Pre Wedding

Follow us on

Anant Ambani Pre Wedding: సహజంగా శ్రీమంతులకు మానవ సంబంధాలు ఉండవంటారు. కేవలం డబ్బు చుట్టే వారు తిరుగుతారంటారు. అది కూడా నిజమే. కానీ కొంతమంది శ్రీమంతులు భావోద్వేగాలను అణుచుకోలేరు. ఎన్ని డబ్బులు ఉన్నా అసలైంది వారి దగ్గర లేకపోవడంతో వెలితిగానే భావిస్తారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దంపతులకు సంబంధించిన మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకల్లోనూ ఇదే వెలితి ముఖేష్ అంబానీలో కనిపించింది. అందుకే అతడి కంట నీరు ఒలికింది. అనంత్ భారీ కాయం ఉన్న వ్యక్తి అంబానీ కుటుంబంలో కాకుండా మరో కుటుంబంలో జన్మించి ఉంటే వివాహం అయి ఉండేది కాదు. ఇలా రాస్తున్నందుకు క్షమించాలి. కానీ తప్పడం లేదు. బరువు తగ్గించుకోవడం కోసం అనంత్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. బహుశా అందువల్లనేమో ముకేశ్ అంబానీ పలుమార్లు కంటనీరు పెట్టుకున్నాడు. అంతకుముందు అనంత్ తనకోసం తన కుటుంబం పడ్డ కష్టం గురించి చెప్పినప్పుడు ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యాడు. కంట నీరు ఒలికించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.

ముందస్తు పెళ్లి వేడుకల్లో చివరి రోజైన మార్చి మూడున ముఖేష్ కుటుంబం హస్తాక్ష అనే పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో కభీ ఖుషి కభీ ఘమ్ అనే సినిమాలో ఓ పాటను పాడుతూ రాధిక అనంత్ అంబానీని ఉత్సాహపరిచారు. ఆ పాట పాడుతూ అతని వద్దకు వచ్చారు. దీంతో అతడు కూడా ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూస్తూ ముకేశ్ అంబానీ కన్నీరు పెట్టుకున్నాడు. రాధిక కూడా భావోద్వేగానికి గురైంది. అది చూసి అనంత్ కళ్ళను చెమర్చాడు. ముకేశ్ అంబానీ భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంటే, అతని భార్య నీతా అంబానీ అనునయించింది. ఈ వీడియోను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఇది లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.

రాధిక, అనంత్ మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకలు జామ్ నగర్ వేదికగా మార్చి 1 నుంచి 3 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బిల్ గేట్స్ నుంచి ఫేస్ బుక్ అధిపతి మార్క్ జూకర్ బర్గ్ వరకు అతిరథ మహారధులు హాజరయ్యారు. వచ్చిన వారికి అంబానీ కుటుంబం 2,500 రకాల వంటకాలతో ఆతిథ్యమిచ్చింది. ప్రముఖ హాలీవుడ్ సింగర్ రిహన్నా ఈ వేడుకల్లో ఆడి పాడింది.. ఇక ఈ వేడుకలు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.