https://oktelugu.com/

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేస్తారా.. కళ్ళు చెదిరే జీతం.. అదిరిపోయే భత్యాలు.. ఇంతకీ ఎలాంటి అర్హతలు ఉండాలంటే..

ముకేశ్ అంబానికి ముంబై మహానగరంలో యాంటిలియా పేరుతో అతిపెద్ద ఇల్లు ఉంది. ఈ భవనానికి అట్లాంటిక్ మహాసముద్రంలోని పౌరాణిక ద్వీపం యాంటిలియా అనే పేరు పెట్టారు. ఈ గృహ సముదాయం 27 అంతస్తుల్లో ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 18, 2024 / 02:50 PM IST

    Mukesh Ambani

    Follow us on

    Mukesh Ambani: ముకేశ్ అంబానీ.. భారత కుబేరుడు… ప్రపంచంలోనే టాప్ -10 ధనవంతుల్లో ఒకడు. ఇటీవలే తన కుమారుడి వివాహాన్ని దాదాపు 1500 కోట్లు ఖర్చుపెట్టి చేశాడు. అనితర సాధ్యమైన ఏర్పాట్లు చేసి ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు. అతిరథ మహారధుల సమక్షంలో తన కుమారుడి వివాహాన్ని జరిపించి..ఔరా అనిపించాడు.. అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా తన కుమారుడి పెళ్లిని నిర్వహించాడు..

    ముకేశ్ అంబానికి ముంబై మహానగరంలో యాంటిలియా పేరుతో అతిపెద్ద ఇల్లు ఉంది. ఈ భవనానికి అట్లాంటిక్ మహాసముద్రంలోని పౌరాణిక ద్వీపం యాంటిలియా అనే పేరు పెట్టారు. ఈ గృహ సముదాయం 27 అంతస్తుల్లో ఉంటుంది. అతిపెద్ద భారీ భూకంపాలను కూడా ఈ భవనం తట్టుకుంటుంది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 8 శాతం ఉన్నప్పటికీ ఈ ఇల్లు చెక్కుచెదరదు. ఈ ఇంటిని ముకేశ్ అంబానీ స్వర్గధామం లాగా భావిస్తాడు. అందుకే ఈ ఇంటి నిర్వహణ కోసం వందలాది మంది పనిచేస్తుంటారు.

    ముకేశ్ అంబానీ యాంటీ లియా లో వంట చేసేవారికి డిగ్రీ లేదా డిప్లమా అర్హత ఉండాలి. ముకేశ్ అంబానీ ఇంట్లో పని చేసే సిబ్బంది మొత్తం దాదాపు 600 మంది దాకా ఉంటారు. వంట చేసే వారికి నెలకు రెండు లక్షలకు పైగా వేతనం ఇస్తారు. అయితే అంతకంటే ముందు వారికి అనేక రకాల పరీక్షలు పెడతారు.. ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు. అన్నిట్లో నెగ్గిన వారికి ఉద్యోగం కల్పిస్తారు. ఇక ముకేశ్ అంబానీ ఇంట్లో ఉద్యోగం వస్తే వారి జీవితం మొత్తం మారిపోయినట్టే. ఎందుకంటే ముఖేష్ అంబానీ తన ఇంట్లో పని చేసే సిబ్బందికి అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తారు. సిబ్బంది ఉండేందుకు ప్రైవేట్ గది ఇస్తారు. ప్రతినెల కళ్ళు చెదిరే విధంగా జీతం ఇస్తారు. చివరికి స్వీపర్లకు కూడా నెలకు లక్షల్లో వేతనం ఇస్తారు. అవి కాకుండా వైద్య, విద్యాభత్యం కూడా వారికి అందిస్తారు. వారి పిల్లలకు ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునే అవకాశం కల్పిస్తారు. ఇవే కాకుండా అద్భుతమైన ఆహారం అందిస్తారు.. అయితే యాంటిలియా లో పని చేసే సిబ్బంది కోసం రిలయన్స్ కంపెనీ నోటిఫికేషన్ లాంటిది జారీ చేయదు. ఆ వ్యవహారం మొత్తం అత్యంత రహస్యంగా జరిగిపోతుంది.. ఒకసారి యాంటిలియా లో ప్రవేశిస్తే.. బయటికి రావడానికి ఎవరూ ఇష్టపడరు. ఆ ఇంట్లో పని చేసే సిబ్బంది తమ జీవితాలను ఆనందమయంగా మార్చుకున్నారు.. తమకు ఈ స్థాయిలో సౌకర్యాలను కల్పించిన అంబానీ కుటుంబం పై అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. అంబానీ కుటుంబ సభ్యులు కూడా సిబ్బందిపై అదే స్థాయిలో వాత్సల్యాన్ని కనబరుస్తారు.

    ఇక ఇటీవల ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిగినప్పుడు.. యాంటీలియాలో పనిచేసే సిబ్బంది ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అక్కడ ఏర్పాట్లలో వారే కీలక భూమిక పోషించారు. వివాహం జరిగిన తర్వాత అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ యాంటీ లియా సిబ్బందితో కలిసి ఫోటోలు దిగారు. వారికి ప్రత్యేకమైన కానుకలు అందించారు. జాతీయ మీడియాలో వినిపించిన కథనాల ప్రకారం ఒక్కొక్కరికి 20 గ్రాముల విలువైన బంగారు కాయిన్ తో పాటు అద్భుతమైన దుస్తులు, తిను బండారాలు కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది.