https://oktelugu.com/

Liquor Consumption: దేశంలో తాగుబోతుల రాష్ట్రం అదే.. తెలంగాణకు ఎన్నో స్థానమంటే..

మనదేశంలో కుటుంబ సంక్షేమంపై కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో మద్యం వినియోగానికి సంబంధించి కూడా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 18, 2024 / 02:45 PM IST

    Liquor Consumption

    Follow us on

    Liquor Consumption: మద్యం.. దేశంలోని సగం రాష్ట్రాలకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయం తోనే చాలా రాష్ట్రాలు బండి లాగిస్తున్నాయి.. దీని ద్వారా మరింత ఆదాయాన్ని అంచనా వేస్తూ.. వచ్చే సంవత్సరాలకు కూడా ముందుగానే మద్యం షాపులకు టెండర్లు ప్రకటిస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందస్తుగానే మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరించారు. దీని ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతో.. అప్పట్లో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు.

    ఇక మనదేశంలో కుటుంబ సంక్షేమంపై కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో మద్యం వినియోగానికి సంబంధించి కూడా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం వినియోగంలో నగరాల కంటే గ్రామాలే టాప్ స్థానంలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూసుకుంటే దేశంలోనే అత్యధికంగా మద్యం తాగే వారి సంఖ్య అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. మద్యం వినియోగంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అక్కడ మద్యం ప్రియుల్లో 52.6% మంది పురుషులు ఉన్నారు. ఆ తర్వాత స్థానం లో తెలంగాణ ఉంది. తెలంగాణలో 43.4 శాతం మంది మద్యాన్ని తాగుతున్నారు. తెలంగాణ తర్వాత సిక్కిం, అండమాన్ 38.8%, మణిపూర్ 37.2%, గోవా 36.8%, చత్తీస్ గడ్ 34.7% తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

    తక్కువ మద్యం తాగే రాష్ట్రాల జాబితాలో లక్షదీప్ మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 0.4% మంది పురుషులు మాత్రమే మద్యం తాగుతున్నారు. ఆ తర్వాత స్థానాలలో 5.8%తో గుజరాత్, 8.7%తో జమ్ము కాశ్మీర్, 11%తో రాజస్థాన్, 13.9%తో మహారాష్ట్ర, 14.5%తో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

    ఇక మహిళల పరంగా చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 24.2 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారు. సిక్కిం రాష్ట్రంలో 16.2%, అస్సాం 7.3 %, తెలంగాణ 6.7%, జార్ఖండ్ 5.7%, అండమాన్ 5%, చత్తీస్ గడ్ 4.9 % తో తర్వాతి స్థానంలో ఉన్నాయి.

    మనదేశంలో 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు 18.7%, దీని సంవత్సరాలు కంటే ఎక్కువ వయసు ఉన్న స్త్రీలు 1.3% మద్యం తాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలు 1.6%, పట్టణ ప్రాంత స్త్రీలు 0.6% మద్యం తాగుతున్నారు.. పట్టణ ప్రాంతాలలో 16.5 శాతం మంది, గ్రామీణ ప్రాంతాలలో 19.9 శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నారు.

    దేశంలో చత్తీస్ గడ్, ఉత్తరాఖండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాలలో మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.. అయితే వీరిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో మద్యం తాగే మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. 2022 మార్చిలో ప్రచురితమైన ఈ అధ్యయనం 2019 నుంచి 2021 వరకు మూడేళ్ల సమాచారాన్ని తెలియజేస్తోంది. ఇక తదుపరి అధ్యయనం 2026 లో ప్రచురితమవుతుంది.