National Awards 2024: 70వ నేషనల్ అవార్డ్స్ తాజాగా కేంద్రం ప్రకటించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేషనల్ అవార్డుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీని మలయాళ, తమిళ సినిమాలు డామినేట్ చేశాయి. 2022 డిసెంబర్ 31 లోపు సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలకు గాను విజేతలను ప్రకటించారు. ఆ సినిమాలు ఏంటి. ఏయే ఓటిట్లో స్ట్రీమ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం ..
ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్క సినిమా మాత్రమే నేషనల్ అవార్డు దక్కించుకుంది. హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 ఉత్తమ చలనచిత్రంగా నిలిచింది. ప్రయోగాత్మక చిత్రాలుగా తెరకెక్కి, ప్రేక్షకుల మెప్పుపొందుతున్న తమిళ, మలయాళ సినిమాలు ఎక్కువ అవార్డులు గెలుచుకున్నాయి. ఆయా సినిమాలు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ మూవీ ‘ అట్టమ్ ‘ నిలిచింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా అందుబాటులో ఉంది.
2. కాంతార చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టికి అవార్డు అందుకున్నారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అందుబాటులో ఉంది.
3. జాతీయ ఉత్తమ నటిగా నిత్య మీనన్ ను నిలిపిన ‘ తిరు ‘ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది. తెలుగు లో కూడా చూడొచ్చు.
4. ఉత్తమ నటిగా మనసి పరేఖ్ కి పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ‘ కచ్ ఎక్స్ప్రెస్ ‘ షిమారో మీ అనే ఒటిటి యాప్ లో ఉంది.
5. ప్రాంతీయ చిత్రాలు విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన కార్తికేయ -2 జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది.
6. పొన్నియన్ సెల్వన్ 1 అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా ఉంది.
7. విజువల్ ఎఫెక్ట్స్, ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డులు అందుకున్న ‘ బ్రహ్మాస్త్ర ‘ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది.
8. సౌదీ వెళ్ళక్క సీసీ 225య/2009 మలయాళ సినిమా సోనీ లివ్ లో అందుబాటులో ఉంది.
9. మరాఠి సినిమా వాల్వి చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. ఈ చిత్రం రెండు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ ఇంకా జీ 5 లో అందుబాటులో ఉంది.
10.మాలికాపురం లో నటనకు ఉత్తమ బాలనటుడిగా శ్రీపాద్ అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది.
11. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో అవార్డు గెలిచిన ‘ కేజీఎఫ్ 2 ‘ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
12. ఉత్తమ మేకప్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో అవార్డులు గెలిచిన బెంగాలీ మూవీ ‘ అపరాజితో ‘ జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది.
13. కుబేర అంతర్జాన్ బెంగాలీ చిత్రం .. జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది.
14. గుల్ మొహర్ హిందీ సినిమా. హాట్ స్టార్ లో చూడొచ్చు.
15. ఉత్తమ దర్శకుడు విభాగంలో సూరజ్ బర్జాత్యా కి అవార్డు తెచ్చిపెట్టిన ‘ ఊంచాయ్ ‘ హిందీ మూవీ జీ 5లో అందుబాటులో ఉంది.
16. ఉత్తమ్ నటుడు, దర్శకుడు సహా పలు అవార్డులు అందుకున్న ఆడు జీవితం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.