MS Dhoni: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్ పై కన్నేసింది. వన్డే సిరీస్ గెలుచుకున్న ఇండియా టీ20 సిరీస్ కూడా దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు తొలి మ్యాచ్ జార్ఖండ్ రాజధాని రాంచీలో జరగనుంది. దీంతో జట్టు గురువారం రాంచీ చేరుకుంది. ఈ నేపథ్యంలో వారిని భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కలుసుకున్నాడు. ధోనీని చూసిన సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ధోనీ వారికి పలు సలహాలు, సూచనలు చేశారు ఆటగాళ్లు ధోనీ చుట్టుముట్టి సరదాగా మాట్లాడారు.

టీమిండియా కెప్టెన్ గా ధోని వన్డే, టీ20 సిరీస్ లలో కప్ లు తీసుకొచ్చిన ధోనీకి ఇప్పటికి ప్రత్యేకంగా చూస్తారు. మిస్టర్ కూల్ ధోనీ చూపిన ప్రతిభ అందరికి ఆచరణీయమే. కెప్టెన్ హార్థిక్ పాండ్యా, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ లకు పలు సూచనలు చేశారు. శుభ్ మన్ గిల్, చాహల్, వాషింగ్టన్ సుందర్ తోనూ మాట్లాడాడు. ఈ సందర్భంగా ట్విటర్ లో బీసీసీఐ ఓ వీడియో విడుదల చేసింది. భారత శిబిరానికి ఎవరు వచ్చారో చూడండి అంటూ ట్వీట్ చేసింది. ద గ్రేట్ మహి అని శీర్షిక కూడా పెట్టడం గమనార్హం.
ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచి మంచి ఊపు మీద ఉన్న టీమిండియా టీ20 సిరీస్ గెలవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆటగాళ్ల సాధన మొదలుపెట్టారు. మూడో వన్డేలో విజయంతో టీమిండియా ప్రపంచంలో నెంబర్ వన్ జట్టుగా స్థానం దక్కించుకుంది. ఆ స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే విజయాలు తప్పనిసరి. లేదంటే మళ్లీ నెంబర్ వన్ స్థానం మారుతుంటుంది. దాన్ని మారనీయకుండా చేయాలంటే విజయం సాధించి తీరాలని చూస్తోంది. ఆటగాళ్లు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు.

న్యూజిలాండ్ పై మూడో వన్డేలో 385 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా మరోమారు భారీ స్కోరు చేయాలనే దిశగా ఆలోచిస్తోంది. న్యూజిలాండ్ పై భారీ లక్ష్యం ఉంచితే త్వరగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లు తమదైన శైలిలో రాణించాలని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. దీనికి ధోని సలహాలు, సూచనలు పనిచేస్తాయని భావిస్తున్నారు. ఏదిఏమైనా టీమిండియా ఆటగాళ్లు తమదైన శైలిలో సమష్టిగా రాణించి టీ20 సిరీస్ కూడా సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.