
MS Dhoni: క్రికెట్ లో విజయం దోబూచులాడుతుంది. బంతి బంతికి మ్యాచ్ మారుతూ ఉంటుంది. దీంతో రెండు జట్లు విజయం కోసం తాపత్రయ పడటం మామూలే. కానీ చివరికంటా పోరాడిన వారే విక్టరీ సాధించడం సహజం. నిన్న జరిగిన మ్యాచ్ లో లక్నోపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం అసహనం వ్యక్తం చేశారు. బౌలర్ల ప్రదర్శన బాగా లేదని కట్టుదిట్టంగా ప్రదర్శన ఉండటం లేదని వాపోయాడు. జట్టు సభ్యుల ఇంకా ప్రాక్టీసు చేయాల్సిన అవసరం ఉంది.
చెపాక్ లో చెన్నై 217 పరుగులు చేసినా కేవలం 12 పరుగుల తేడాతో విజయం సాధించడంలో బౌలర్ల తప్పిదం ఉన్నట్లు గుర్తించారు. చెన్నై బౌలర్లలో అదనపు పరుగులు సమర్పించుకోవడం బాధాకరం. ఇలా చేస్తే తాను జట్టు కెప్టెన్ గా ఉండబోనని ధోనీ తెగేసి చెప్పాడు. భవిష్యత్ లో ఇలా అయితే విజయం అంత తేలికగా రాదని చెబుతున్నాడు. చెన్నై బౌలర్లు మొత్తం 18 ఎక్స్ ట్రాలు వేశారు. ఇందులో 13 లెగ్ బైస్ లు, మూడు వైడ్ లు, 3 నోబాల్స్ ఉన్నాయి. దీనిపై ధోని విచారం వ్యక్తం చేశారు.

లక్నో లక్ష్య చేధనలో వీరోచితంగా పోరాడింది. కేవలం 12 పరుగుల తేడాతో విజయం సాధించడంతో నైతిక విజయం వారిదే అనే స్థాయికి వెళ్లింది. కేఎల్ రాహుల్ సేనను ధోనీ సేన మట్టి కరిపించినా బౌలర్ల తీరుకు బాధ పడ్డాడు. రాబోయే రోజుల్లో ఇలా అయితే గెలుపు సాధ్యం కాదని చెప్పాడు. అదనపు పరుగులు ఇచ్చుకోవడం తగ్గించుకోవాలి. ఫాస్ట్ బౌలింగ్ ను మెరుగుపరుచుకోవాలి. తుషార్ పాండే మూడు నో బాల్స్ వేశాడు. అంతకుముందు గుజరాత్ తో ఆడిన మ్యాచ్ లో కూడా 12 పరుగులు అదనంగా సమర్పించుకున్నాడు.
ఇందులో 6 లెగ్ బైస్, నాలుగు వైడ్, రెండు నో బాల్స్ వేశాడు. దీంతో బౌలర్ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. అదనంగా పరుగులు సమర్పించుకోవడంతో ధోనీ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. బౌలర్ల ఆటతీరు ఉత్తమంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ బౌలర్ల తీరు మారడం లేదు. ఫలితంగా సునాయాసంగా గెలవాల్సిన మ్యాచులు టైట్ గా మారుతున్నాయి. చెమటోడ్చి నెగ్గాల్సిన అవసరం ఉంటుంది. అందుకే బౌలర్ల తీరు మారకపోతే తాను కెప్టెన్ గా కొనసాగనని తేల్చేస్తున్నాడు.