She Is Not A Female: నూరు అబద్దాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు. కానీ వారు మాత్రం ఉన్న విషయం దాచి పెళ్లి జరిపించారు. తీరా విషయం తెలిశాక భర్త మాత్రం కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు అవయవాలు సరిగా లేవని చెబుతూ సుప్రీంకోర్టులో కేసు వేయడం సంచలనం కలిగిస్తోంది. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం అని చెబుతున్నారు. తనకు ఏమీ చెప్పకుండా దాచి పెట్టి పెళ్లి చేసి తన జీవితం నాశనం చేశారని వాపోతున్నాడు. ఇకపై తనతో కాపురం చేయలేనని వాపోతున్నాడు. శోభనం రోజు తన భార్య ఆడది కాదని తెలుసుకుని అవాక్కయ్యాడు.

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెంి. ఓ భర్త తన భార్యకు అవయవాలు కరెక్టుగా లేవని చెబుతూ సుప్రీంకోర్టు కడప తొక్కాడు. వైవాహిక జీవితం ఆనందంగా లేదని నిరసన వ్యక్తం చేస్తున్నాడు. తన భార్యకు పురుషుడి మాదిరి జననేంద్రియాలు ఉన్నాయని చెబుతున్నాడు. అయితే ఆమెతో తాను కాపురం మాత్రం చేయడం వీలు కాదని బుకాయిస్తున్నాు. దీంతో 2016లో పెళ్లయినా సంసార జీవితం మాత్రం సంతృప్తిగా లేదని చెబుతున్నాడు. పురుష లక్షణాలు ఉండటంతో భర్త ఆశ్చర్యపోయాడు.
Also Read: Allu Arjun Puspha-2: అంతర్జాతీయ మాఫియా వరకూ వెళ్ళబోతున్న పుష్ప 2 !
వైద్య పరీక్షలు నిర్వహించగా కంజెనిటల్ అడ్రినల్ హైపర్ ప్లాసియా అనే జన్యుపరమైన లోపంతోనే ఇలా ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాహ్య జననేంద్రియాలు బాలుడి వలే ఉండటంతో ఇక సంసారం చేయలేనని నిరాకరిస్తున్నాడు. శస్ర్త చికిత్స ద్వారా మార్పు చేసుకున్నా ఫలితం మాత్రం ఉండదని తెలుస్తోంది. అందుకే ఆమెతో ఇక సంసారం చేయలేనని పంచాయితీలు చేసినా కేసులు పెట్టినా అతడు మాత్రం వినిపించుకోవడం లేదు.
అయితే ఆమెకు ఉండాల్సిన లక్షణాలు లేకపోవడంతో సంసార జీవితం సాగదని చెబుతూ కోర్టు ఆదేశానుసారం వైద్య పరీక్షలు చేయించుకోనని నిరాకరించడంతో ఆమె భర్త సుప్రీంకోర్టుకు వెళ్లాడు. నిజం దాచి తనను మోసం చేశారని పేర్కొంటున్నాడు. తప్పుడు వివరాలు చెప్పి తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. విచారణ జరిపిన తరువాత కేసు పూర్వాపరాలు తెలుసుకుని తుది తీర్పు వెలవరించే అవకాశం ఉంది.
Also Read: Janasena-TDP: టీడీపీతో వెళితే పవన్ కు లాభమా? నష్టమా? కార్యకర్తల డిమాండ్లు ఇవీ!