Homeఆంధ్రప్రదేశ్‌Janasena Formation Day LIVE: జనసేన 9వ ఆవిర్భావ సభ: పవన్ కళ్యాణ్ స్పీచ్ లైవ్

Janasena Formation Day LIVE: జనసేన 9వ ఆవిర్భావ సభ: పవన్ కళ్యాణ్ స్పీచ్ లైవ్

LIVE : Janasena Formation Day Live || Janasena Party || Pawan Kalyan || JanaSena Chalo Amaravati

Janasena Formation Day LIVE: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనసేన సింహగర్జనకు వేదిక రెడీ అయ్యింది. యావత్ ఆంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న ఆ సమయం ఆసన్నమైంది. జనసేన 9వ ఆవిర్భావ వేడుకలు ఆంధ్రప్రదేశ్ లోని తాడేప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఇప్ప‌టం గ్రామంలో నేడు జరగనున్నాయి. జనసేన ఆవిర్భావ సభా వేదికకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా పేరు పెట్టారు. ఈ వేదిక నుంచే పవన్ కల్యాణ్ కల్యాణ్ జనసేన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

Janasena Formation Day LIVE
Janasena Formation Day LIVE

జనం గుండెల్లో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కల్యాణ్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి స్థాపించిన ‘జనసేన పార్టీ’ నేడు తొమ్మిదో ఆవిర్భావ సభ చేసుకోబోతుంది. ఈ వేదిక నుంచి పవన్ కల్యాణ్ జనసైనికులకు దిశానిర్దేశం చేసేందుకు రెడీ అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జనసైనికులను ఉత్తేజపరిచేలా పవన్ కల్యాణ్ ప్రసంగం ఉండనుంది. ఈక్రమంలోనే ప్రత్యర్థులకు పవన్ ఈ సభ నుంచే హెచ్చరికలు పంపనున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీని టార్గెట్ చేయనున్నారు. భీమ్లానాయక్ సినిమాకు కల్పించిన అడ్డంకులపై పవన్ గళమెత్తనున్నారు.

Also Read: KTR and Bandi Sanjay War: కంటోన్మెంట్ వార్: టచ్ చేసి చూస్తే కేటీఆర్ కు చుక్కలేనంటున్న ‘బండి’

ఇక ఏపీ రాజకీయ భవిష్యత్తును మార్చే సభగా దీన్ని నిన్నటి వీడియోలో పవన్ అభివర్ణించారు. ఈ క్రమంలోనే పొత్తులపై కూడీ కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీతో కలిసి సాగుతున్న జనసేన లక్ష్యాలు.. 2024 ఎన్నికల్లో గెలుపుకోసం అవలంభించాల్సిన వ్యూహాలను కూడా పవన్ తన జనసైనికులకు దిశానిర్ధేశం చేయనున్నారు. పవన్ చేసే ఈ ప్రసంగంపై ఏపీ ప్రజలే కాదు.. అధికార, ప్రతిపక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఈ లైవ్ స్పీచ్ ను మీరు చూడాలంటే కింది వీడియోలో క్లిక్ చేయండి..

Also Read: Vijayasai Reddy: ఏపీ ఆర్థికమంత్రిగా విజయసాయిరెడ్డి.. జగన్ సంచలనం?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

  1. […] Pawan Kalyan Target 2024: ఆంధప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగా రాజకీయ వేడి రాజుకుంటోంది. 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో వైసీపీలో వణుకుపుడుతోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని పవన్ కల్యాణ్ చెప్పడంతో వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇదేకనుక జరిగితే తాము అధికారంలోకి రావడం కల్లా అని ఫిక్స్ అయినట్లు కన్పిస్తోంది. […]

Comments are closed.

Exit mobile version